MLCగా ప్రొఫెసర్‌ కొదండరామ్‌, గవర్నర్‌ ఆమోదం !

0

గవర్నర్‌ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలను తమిళిసై సౌందరరాజన్‌ ఎంపిక చేశారు. గవర్నర్‌ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీ ల నియమకానికి ప్రభుత్వం ఎంపిక చేసిన వారికి గవర్నర్‌ ఆమోద ముద్ర వేసారు.  ప్రొఫెసర్‌ కోదండరామ్‌, మీర్‌ అమీర్‌ అలీఖాన్‌ల నియామకానికి గవర్నర్‌ ఆమోదం తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలకు సంబంధించి ప్రతిపాదనలు పంపింది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ప్రొఫెసర్‌ కోదండరామ్‌, సియాసత్‌ పత్రిక రెసిడెంట్‌ ఎడిటర్‌ జావెద్‌ అలీఖాన్‌ కుమారుడు మీర్‌ అమీర్‌ అలీఖాన్‌లను ఎమ్మెల్సీలుగా ప్రభుత్వం ప్రతిపాదించింది. నిన్న తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి రాజ్‌భవన్‌కు వెళ్లి ఎమ్మెల్సీల అంశంపై చర్చించారు.తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషనర్‌ ఛైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్‌ రెడ్డి నియామకాన్ని కూడా గవర్నర్‌ తమిళిసై ఇవాళ ఆమోదించిన విషయం తెలిసిందే.

మంత్రివర్గంలోకి కోదండరాం?

తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి ఇటీవల ఢల్లీి వెళ్లి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక, నామినేటెడ్‌ పోస్టుల భర్తీపై చర్చించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కోదండరాం బేషరతుగా కాంగ్రెస్‌ పార్టీకి మద్దతిచ్చి ఆ పార్టీ విజయానికి కృషి చేశారు. ఆ సమయంలో కోదండరామ్‌ పార్టీకి రెండు ఎమ్మెల్సీలు హామీ ఇచ్చారు. ఇక, ఇప్పుడు కోదండరామ్‌ ను ఎమ్మెల్సీ చేయటంతో కేబినెట్‌ లోనూ అవకాశం ఇస్తారా అనే చర్చ మొదలైంది. త్వరలోనే మంత్రివర్గ విస్తరణకు అవకాశం ఉంది. మరో ఆరుగురిని కేబినెట్‌ లో తీసుకునే అవకాశం ఉంది. తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్‌ కోదండరామ్‌ కీలకంగా వ్యవహరించారు. హైదరాబాద్‌, రంగారెడ్డి నుంచి ప్రస్తుత మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. దీంతో ఎమ్మెల్సీగా కోదండరామ్‌కు ఛాన్స్‌ దక్కుతుందా, లేక పార్టీ నేతలకే ప్రాధాన్యత ఇస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో గవర్నర్‌ కోటాలో దాసోజు శ్రవణ్‌, కుర్ర సత్యనారాయణలను ఎమ్మెల్సీలుగా నామినేట్‌ చేయాలని గవర్నర్‌కు సిఫార్సు చేసింది. క్యాబినెట్‌ సిఫార్సు చేసిన అభ్యర్థులకు ఆయా రంగాల్లో ప్రత్యేకతలు, నైపుణ్యాలు, గుర్తించదగిన కృషి చేసినట్లు ఆధారాలు లేవంటూ.. గత ఏడాది సెప్టెంబరు 9న వారి అభ్యర్థిత్వాలను గవర్నర్‌ తిరస్కరించారు. గవర్నర్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దాసోజు శ్రవణ్‌, కుర్ర సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా హైకోర్టు నుంచి ఈ అంశంలో స్పష్టత రావటంతో ప్రభుత్వం సిఫార్సు చేసిన ఇద్దరినీ ఎమ్మెల్సీలుగా నియమిస్తూ గవర్నర్‌ ఆమోద ముద్ర వేసారు. 



నామినేటెడ్‌ పోస్టుల భర్తీ 

పార్లమెంట్‌ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం రేవంత్‌ నామినేటెడ్‌ పదవుల భర్తీ వేగవంతం చేసారు. ఈ నెలాఖరులోగా కీలకమైన నామినేటెడ్‌ పోస్టులను సీఎం రేవంత్‌ భర్తీ చేయనున్నట్లు సమాచారం. ఎన్నికల్లో పోటీకి సీట్లు ఇవ్వలేకపోయిన వారికి..పార్టీ కోసం పని చేసిన వారికి ముఖ్యమైన పదవులు ఇచ్చేలా కసరత్తు చేస్తున్నారు. దాదాపు 18 మందికి పోస్టులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్‌ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేడర్‌ లో జోష్‌ పెంచేందుకు పదవులను భర్తీ చేసేందుకు రేవంత్‌ పార్టీ హైకమాండ్‌ అనుమతి తీసుకున్నారు. ఒకటి, రెండు రోజుల్లోనే మరిన్ని నియామకాలకు సంబంధించి నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. తాజాగా నలుగురు సలహాదారులను నియమించిన రేవంత్‌ తాజాగా తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నియామక ప్రక్రియ పూర్తి చేసారు. ఎమ్మెల్యే కోటాలో ఇద్దరిని ఎమ్మెల్సీలుగా నియామకం పూర్తయింది. దీంతో, గవర్నర్‌ కోటాలో ఇద్దరిని ఎంపిక చేసారు.ప్రొఫెసర్‌ కోదండరామ్‌ను గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్‌ చేసింది. కోదండరామ్‌తో పాటు అమరుల్లా ఖాన్‌ను గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ చేసింది. వీరిద్దర్ని గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమిస్తూ రాజ్‌ భవన్‌ నుంచి ఉత్తర్వులు వచ్చాయి. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఆమోద ముద్ర తెలపడంతో ప్రొఫెసర్‌ కోదండరామ్‌కు కీలక పదవి దక్కింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !