CM Revanth Reddy : కుమారి ఫుడ్‌స్టాల్‌ మార్పుపై స్పందిచిన సిఎం రేవంత్‌రెడ్డి !

0

చిరు వ్యాపారి సోషల్‌మీడియా సెన్సేషప్‌ కుమారి ఆంటీ ఫుడ్‌ స్టాల్‌ స్థలాన్ని మార్చాలన్న అధికారుల నిర్ణయంపై సీఎం రేవంత్‌ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఫుడ్‌ స్టాల్‌ స్థల మార్పు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సీఎం రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు తెలంగాణ డీజీపీ, ఎంఏయూడీ అధికారులకు రేవంత్‌ ఆదేశాలు జారీ చేశారు. కుమారి మొన్నటివరకు వ్యాపారం చేసుకున్న స్థానంలోనే తన వ్యాపారాన్ని తిరిగి కొనసాగించుకోవచ్చని తెలిపారు. ప్రజా పాలనలో సామాన్యులకి ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. త్వరలోనే ఆమె స్టాల్‌ను సందర్శిస్తామని సైతం రేవంత్‌ తెలిపారు.

అసలేం జరిగిందంటే..

సైబరాబాద్‌లో స్ట్రీట్‌ ఫుడ్‌ అనగానే ఇటీవలి కాలంలో కుమారి ఆంటీ పేరు బాగా వినిపిస్తోంది. రాయదుర్గం నాలెడ్జ్‌ సిటీ, ఐటీసీ కోహినూర్‌ హోటల్‌ పక్కన కొంతకాలంగా కుమారి స్టాల్‌ నిర్వహిస్తున్నారు. ఆమె కొన్నేళ్లుగా వ్యాపారం నిర్వహిస్తున్నప్పటికీ ఇటీవలి కాలంలో కొందరు యూట్యూబ్‌ ఛానల్స్‌ వాళ్లు బ్లాగ్స్‌ చేయడంతో ఆమె వీడియోలు బాగా వైరల్‌ అయిపోయాయి. దీంతో ఆమె ఓవర్‌ నైట్‌లో యూట్యూబ్‌ స్టార్‌ అయిపోయింది. మధ్యాహ్నం ఒంటి గంట అయితే కుమారి ఫుడ్‌ ట్రక్‌ వద్ద విపరీతమైన రద్దీ ఉంటోంది. గత కొన్ని రోజులుగా భోజన ప్రియులు పెద్ద ఎత్తున అక్కడికి వస్తున్నారు. దీంతో  ఆ ఏరియాలో ఆమె ఫుడ్‌ స్టాల్‌ కారణంగా విపరీతంగా ట్రాఫిక్‌ రద్దీ ఏర్పడిరది. దీంతో నిన్న ఆమె ఫుడ్‌ ట్రక్‌ను ట్రాఫిక్‌ పోలీసులు అడ్డుకున్నారు. ఆమె పోలీసులను ఫుడ్‌ వేస్ట్‌ అవుతుందని వేడుకోవడంతో వదిలేశారు. కాగా.. గత రాత్రి ఆ ఏరియాలో స్ట్రీట్‌ ఫుడ్‌ కోసం వేసి టెంట్లన్నింటినీ పోలీసులు తొలగించారు. ఫుడ్‌ స్టాల్‌ స్థలాన్ని మార్చాలని అధికారులు ఆదేశించారు. ఈ విషయాలన్నీ సీఎం రేవంత్‌ దృష్టికి వెళ్లడంతో ఆయన ఫుడ్‌ స్టాల్‌ స్థల మార్పిడి నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !