నటి సమంత సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. తాజాగా ఆమె అభిమానుల ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ సందర్భంగా తన వైవాహిక జీవితం గురించి పరోక్షంగా కామెంట్స్ చేశారు. తన జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు ఏమిటి? అనేది చెప్పారు. నా ఇష్టాయిష్టాలను గుర్తించడంలో విఫలమయ్యాను. దానిని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. ఎందుకంటే గతంలో నా భాగస్వామి వాటిని ప్రభావితం చేశాడు. క్లిష్ట సమయం నుంచే మనం విలువైన పాఠం నేర్చుకోగలమని అర్థమైంది. ఈ విషయాన్ని గ్రహించిన తర్వాతే నా వ్యక్తిగత ఎదుగుదల మొదలైంది’ అన్నారు. ఇక గతంలోనూ సమంత ఒక ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ తన విడాకులు, వరుస ఫ్లాప్‌లు, ఆరోగ్య సమస్యలు ఒకేసారి చుట్టుముట్టడంతో ఎంతో కుంగిపోయినట్లు తెలిపారు. ఒకవైపు ఆరోగ్యం దెబ్బతింటుంటే.. మరోవైపు వైవాహిక బంధం ముగిసిందని పేర్కొన్నారు. దీంతో కుంగుబాటుకు గురైనట్లు చెప్పారు. ప్రస్తుతం సమంత సినిమాలకు విరామం ప్రకటించి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టారు. మయోసైటిస్ తో బాధపడుతుండటంతో దానికి చికిత్స తీసుకోవడం కోసం సమయాన్ని కేటాయించి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టారు. ప్రస్తుతం సమంత సినిమాలకు విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆమె నటించిన ‘సిటాడెల్’ (ఇండియన్ వెర్షన్) వెబ్‌సిరీస్ విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు, ఆమె కొన్ని రోజుల క్రితం నిర్మాతగానూ మారిన సంగతి తెలిసిందే. ‘ట్రా లా లా మూవింగ్ పిక్చర్స్’ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ బ్యానర్ ద్వారా ప్రతిభావంతులైన కొత్త దర్శకులు, నటీనటులను ప్రోత్సహించనున్నారు. తన నిర్మాణ సంస్థద్వారా ఎంతోమంది ప్రతిభ కలిగినవారు వెలుగులోకి రావాలనేది సమంత కోరిక.