TS Congress : ఎమ్మేల్సీలను ప్రకటించిన కాంగ్రెస్‌, అద్దంకి దయాకర్‌కు మెండిచేయి !

0

కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడిరది. ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్‌ పార్టీ ఇవాళ అధికారికంగా ప్రకటించింది. ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు బల్మూరి వెంకట్‌, మహేష్‌ కుమార్‌ గౌడ్‌ పేర్లను కాంగ్రెస్‌ హై కమాండ్‌ ఎంపిక చేసింది. ఈ మేరకు గురువారం ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే, మొదట ఈ రెండు స్థానాలకు అద్దంకి దయాకర్‌, బల్మూరి వెంకట్‌లను ఎంపిక చేసినట్లు మంగళవారం మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. నామినేషన్‌ వేసేందుకు సిద్ధం కావాలని ఇరువురికి పార్టీ హై కమాండ్‌ సూచించినట్లు జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా ఇవాళ ప్రకటించిన అభ్యర్థుల లిస్ట్‌లో అనూహ్యంగా అద్దంకి దయాకర్‌కు చోటు దక్కకపోవడం పొలిటికల్‌ సర్కిల్స్‌లో హాట్‌ టాపిక్‌గా మారింది. దయాకర్‌ స్థానంలో మహేష్‌ కుమార్‌ గౌడ్‌కు కాంగ్రెస్‌ పార్టీ అవకాశం కల్పించడంతో అద్దంకికి మరో పోస్ట్‌ ఏదైనా ఇస్తారా అని చర్చ జరుగుతోంది.

కాంగ్రెస్‌ ఖాతాలో మరో రెండు స్థానాలు !

కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌ రెడ్డి ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. దీంతో వీరిద్దరూ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. వీరి రాజీనామాతో ఎమ్మెల్యే కోటాలో రెండు ఎమ్మెల్సీ పోస్ట్‌లు ఖాళీ అవ్వడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నెల 18వరకు నామినేషన్లు దాఖలకు ఈసీ అవకాశం కల్పించింది. 29వ తేదీన రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా.. అదే రోజు సాయంత్రం ఫలితాలను వెల్లడిరచనుంది. ఎన్నికల సంఘం రెండు స్థానాలకు వేర్వేరు నోటిఫికేషన్లు ఇవ్వడంతో ప్రస్తుత అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్యాబలం పరంగా రెండు స్థానాలు అధికార కాంగ్రెస్‌ పార్టీకే దక్కనున్నాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !