- కడప యంపీ స్థానంలో వైఎస్ షర్మిల
- సొంత కుటుంబంతోనే వైఎస్ జగన్ యుద్దం !
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్‌కు మరో చెల్లెలు షాక్ ఇవ్వబోతోంది. జగన్ సోదరి, వైయస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ నర్రెడ్డి సునీత రెడ్డి ప్రత్యక్ష రాజకీయాలు అడుగు పెడుతున్నారు. ఆమె త్వరలో కాంగ్రెస్‌లో చేరబోతున్నారు. షర్మిల ఇప్పటికే పీసీసీ అధ్యక్షురాలుగా ఏపీలో చక్రం తిప్పబోతున్న సమయంలో సునీత కూడా కాంగ్రెస్ లో జాయిన్ అవ్వాలనుకోవడం రాజకీవర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య తరువాత ఆమె కుమార్తె సునీతా రెడ్డి యాక్టివ్ అయ్యారు. వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు కీలకమైన సమాచారం ఇచ్చారు. అంతేకాదు.. కోర్టుల్లో కేసుల్లో కూడా సునీత ఇంప్లీడ్ అయ్యారు. తన తండ్రిని చంపిన వారికి శిక్ష పడాలని న్యాయ పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి సునీత అడుగు పెట్టబోతున్నారు. వైఎస్ జగన్‌కు అపోజిట్‌గా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఇప్పటికే సోదరి షర్మిల ఏపీ పీసీసీ పగ్గాలు చేపట్టడంతో తాను కూడా ఆ పార్టీలోనే జాయిన్ అవ్వాలని సునీత నిర్ణయించారు. అంతే కాదు కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని సునీత నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.
ప్రజాక్షేత్రంలోనే తేల్చుకునేందుకు సిద్ధమైన సునీత రెడ్డి !
వివేకా హత్య కేసులో సునీతకు కోర్టులో న్యాయం జరిగినా, జరగకపోయినా ప్రజాక్షేత్రంలో న్యాయం జరగాలని వివేకా కుమార్తె సునీత భావిస్తోంది. డాక్టర్ సునీత పులివెందుల ఎమ్మేల్యే బరిలో అన్న జగన్‌ను ఢీ కొట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజాక్షేత్రంలోనే తండ్రి మరణానికి బాధ్యులైన వారికి శిక్ష పడేలా చేయటంతో పాటు అధికారం బలంతో ఏదైనా చేయవచ్చు అనుకునే వారికి బుద్దిచెప్పాటని యోచిస్తున్నట్లు డాక్టర్ సునీత భావిస్తోంది. అలాగే సునీత భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డికి కూడా కడప జిల్లాలో ఒక స్థానంలో పోటీ చేసే అవకాశాల్ని పరిశీలిస్తోంది. డాక్టర్ సునీత పోరాట ఫలితంగా వైఎస్ వివేకా మరణంపై ఉన్న అనుమాలకు ఒక్కొక్కటిగా సమాధానం వస్తోందని ప్రజలు సైతం భావిస్తున్నారు. విపక్షంలో ఉండగా తెలుగుదేశంపై ఆరోపణలు గుప్పించిన జగన్.. అధికారంలోకి వచ్చిన తరువాత ఈ కేసు ఎప్పటికీ తేలకుండా ఉండేలా అడుగులు వేశారు. విపక్షంలో ఉండగా సీబీఐ దర్యాప్తు అంటూ డిమాండ్ చేసిన ఆయన అధికారంలోకి వచ్చాకా సీబీఐ దర్యాప్తు అవసరం లేదని అన్నారు. సునీత గట్టిగా నిలబడి ఉండకపోతే ఏం జరిగేది? ఈ కేసు ఎప్పటికీ పరిష్కారమయ్యేది కాదు. లేకుంటే టీడీపీ పార్టీ పరంగా, చంద్రబాబు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు తాలుకు అపవాదును మోయవలసి వచ్చేది. ఆమె పోరాటం ఫలితంగానే టీడీపీకి మేలు జరిగింది అన్నది కాదనలేని వాస్తవం.
జగన్ పోటీ చేసే స్థానం మారుతారా ?
వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీత రెడ్డి స్వయంగా పులివెందులలో పోటీ చేసే ఆలోచన ఉంటే జగన్‌రెడ్డికి కచ్చితంగా తను పోటీ చేసే స్థానం మార్చుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సునీత రెడ్డి పోటీ చేసే పరిస్థితుల్లో ఇప్పటికే జనంలో ఉన్న సానుభూతి కారణంగా ఓటర్లు సునీత వైపు మొగ్గు చూపే అవకాశం ఉన్నందున గట్టిపోటీ తప్పదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చూద్దాం జగన్ రెడ్డి ఈ గడ్డు పరిస్థితుల్ని ఎలా ఎదుర్కొంటారో.