తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును వైఎస్ షర్మిల కలిశారు. ఇవ్వాళ ఉదయం 11 గంటలకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబును ఆయన నివాసంలో వైఎస్ షర్మిలా రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను అందించారు. ఇటీవలే వైయస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహం ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. అమెరికాలో సెటిల్ అయిన ఓ అమ్మాయిని రాజారెడ్డి ప్రేమించాడు. ఇక వీరి ప్రేమకు షర్మిల కుటుంబం ఒప్పుకుంది. పెళ్లి కూడా ఫిక్స్ చేసింది. దీంతో తన కుమారుడి పెళ్లి కార్డు పట్టుకొని, ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు వైఎస్ షర్మిల. ఇందులో భాగంగానే ఇవాళ చంద్రబాబును ఆయన నివాసంలో వైఎస్ షర్మిలా రెడ్డి కలిశారు.
ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదు !
అనంతరం మీడియాతో షర్మిల మాట్లాడారు.ఈ సమావేశానికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదు. నా కుమారురు రాజారెడ్డి పెళ్లికి చంద్రబాబును పిలించేందుకు మాత్రమే వచ్చా. మా కుటుంబంలో పెళ్లిళ్లకు ఆయనను వైఎస్‌ఆర్ పిలిచారు. క్రిస్మస్ సందర్భంగా చంద్రబాబు, లోకేశ్‌కు స్వీట్లు పంపాను. ప్రతి విషయాన్ని రాజకీయాలతో ముడిపెట్టవద్దు. కేటీఆర్, కవిత, హరీశ్‌రావుకు కూడా స్వీట్లు పంపాం. రాజకీయం అనేది మా జీవితం కాదు.. అది మా వృత్తి. ప్రజా పోరాటంలో భాగంగా విమర్శలు చేసుకుంటాం. రాజకీయాల్లో వ్యక్తిగత కక్షలు ఉండకూడదు. స్నేహపూర్వక వాతావరణం ఉండాలి. నాకు ఏ బాధ్యతలు ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ ఇష్టం. రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలని వైఎస్‌ఆర్ కోరుకునేవారు. రాహుల్ ప్రధాని అయితేనే మతకలహాలు తగ్గుతాయి’’ అని చెప్పారు.