Balka Suman : ఖబడ్దార్‌.. అంటూ సిఎంపై ఆగ్రహాంతో ఊగిపోయిన బాల్క సుమన్‌

0


బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై సీఎం రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై గులాబీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కేసీఆర్‌ను విమర్శిస్తూ.. రేవంత్‌ రెడ్డి ఉపయోగించిన పదాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ స్పందిస్తూ.. ఆవేశంతో ఊగిపోయారు. ఉద్యమ నాయకుడు, మాజీ సీఎం అయిన కేసీఆర్‌ను తిడితే.. ఊరుకునేది లేదన్నారు. తాము ప్రభుత్వంలో లేకపోయినప్పటికీ.. లక్ష మందితో పండబెట్టి తొక్కుతామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌ను అంటే.. చెప్పుతో కొడతామంటూ వేదికపైనే చెప్పు చూపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. తమకు సంస్కారం అడ్డొచ్చి ఆగిపోతున్నట్టు పేర్కొన్నారు బాల్క సుమన్‌.

లక్షమందితో పండబెట్టి తొక్కుతాం !

మంచిర్యాలలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన బాల్క సుమన్‌.. సీఎం రేవంత్‌ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇన్ని రోజులు ప్రతిపక్ష నేతగా చాలా మాట్లాడి ఉండొచ్చని.. కానీ ఇప్పుడు సీఎం స్థానంలో ఉన్న వ్యక్తిగా.. పదవిని బట్టి, స్థాయిని బట్టి మాట్లాడాలని రేవంత్‌ రెడ్డికి బాల్క సుమన్‌ హితవు పలికారు. ఈ సందర్భంగా ఆగ్రహాంతో ఊగిపోయారు. సిఎం రేవంత్‌ రెడ్డిని తీవ్ర పదజాలంతో దూషించారు. ఈ చెత్తనాకొడుకుని చెప్పు తీసుకుని కొడతానంటూ చెప్పు చూపించారు. అయితే.. తనకు సంస్కారం అడ్డొస్తుందంటూ చెప్పుకొచ్చారు. ఖబడ్దార్‌.. కేసీఆర్‌ను తిడితే లక్ష మందితో పండబెట్టి తొక్కుతామంటూ బాల్క సుమన్‌ హెచ్చరించారు. మరోవైపు.. ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా నిర్వహిస్తామని, ప్రభుత్వాన్ని కూల్చే అవసరం బీఆర్‌ఎస్‌కు లేదని బాల్క సుమన్‌ చెప్పుకొచ్చారు. ప్రతిపక్షంలో ప్రజల గొంతుకగా నిలుస్తామని స్పష్టం చేశారు. ప్రజలకు అత్యాశ చూపి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసేలా ఒత్తిడి తీసుకువస్తామని హెచ్చరించారు. డిసెంబర్‌ 9వ తేదీన చేస్తామన్న రుణమాఫీ, రూ.4 వేలు పెన్షన్‌, రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌, మెగా డీఎస్సీ, జాబ్‌ క్యాలెండర్‌లకు సంబంధించిన హామీలను కాంగ్రెస్‌ నెరవేర్చలేకపోయిందని విమర్శించారు. చెన్నూరుపై మళ్లీ గులాబీ జెండా ఎగరే వరకు నియోజకవర్గమే తన ఇలాకా అని సుమన్‌ స్పష్టం చేశారు. చెన్నూరు విడిచి వెళ్లిపోతానంటూ దుష్ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్‌పై మండిపడ్డారు. గత ఎన్నికల్లో చెన్నూరు అభ్యర్థిగా వివేక్‌ ఇచ్చిన హామీలు అన్నింటినీ నెరవేర్చాలని బాల్క సుమన్‌ డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ది కుటుంబ పాలనైతే వినోద్‌, వివేక్‌ ఎమ్మెల్యేలు ఎలా అయ్యారని ప్రశ్నించారు. కొడుకు వంశీకి ఎంపీ టిక్కెట్టు కోసం వివేక్‌ ఆశపడటం కుటుంబ పాలన కాదా? అని నిలదీశారు. వివేక్‌ను చెన్నూరు నియోజకవర్గానికి నిధులు తీసుకురమ్మంటే తన కుమారుడికి ఎంపీ సీటు కోసం ఢల్లీి, హైదరాబాద్‌లో బిజీగా ఉంటున్నారని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !