నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. బర్డ్ ఫ్లూతో వేల సంఖ్యలో బాయిలర్, లేయర్, నాటుకోళ్లు మృత్యువాతపడుతున్నాయి. జిల్లాలో బర్డ్ ఫ్లూ శరవేగంగా విస్తరిస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు.. భూపాల్‌లోని ల్యాబ్‌లకు శ్యాంపుళ్లను పంపారు. బర్డ్ ఫ్లూగా భూపాల్ ల్యాబ్ నిపుణులు నిర్ధారించారు. దీంతో గ్రామస్తులు బర్డ్ ఫ్లూతో వణికిపోతున్నారు. అయితే బర్డ్ ఫ్లూ వ్యాపించకుండా కలెక్టర్ హరినారాయణన్ ఆదేశాల మేరకు అధికారులు చర్యలు చేపట్టారు. పొదలకూరు, కోవూరు మండలాల్లోని ఇటీవల ఏవీఏఎన్ ఇన్‌ఫ్లూఎంజాతో కోళ్లు పెద్దఎత్తున చనిపోయాయని తెలిపారు. దీంతో అధికారులు పలు గ్రామాల్లో శానిటైజేషన్ పనులు చేపట్టారు. ఆ ప్రాంతంలో చికెన్ షాపుల్ని మూడు నెలల పాటూ మూసేయాలని కలెక్టర్ ఆదేశించారు.బర్డ్‌ఫ్లూ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎం హరినారాయణన్ అధికారులను ఆదేశించారు. నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. కోళ్లు మృతి చెందిన ప్రాంతానికి పది కిలోమీటర్ల పరిధిలో నిబంధనల ప్రకారం మూడు రోజుల పాటూ చికెన్ షాపులు మూసివేయాలని.. కిలోమీటరు పరిధిలో మూడు నెలల వరకు షాపులు తెరవకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఆ ప్రాంతాల నుంచి 15 రోజుల వరకు కోళ్లు బయటకు వెళ్లకుండా, ఇతర ప్రాంతాల నుంచి తీసుకురాకుండా చూడాలన్నారు. చనిపోయిన కోళ్లను భూమిలో పాతి పెట్టాలని తెలిపారు.. పనిచేసేవారు జాగ్రత్తగా ఉండాలి. ప్రజలు, కోళ్ల పెంపకందారులు, చికెన్ షాప్ యజమానుల్లో చైతన్యం తేవాలన్నారు. ఆయా గ్రామాల పరిధిలో శానిటైజేషన్ చేయించాలని సూచించారు. ఈ బర్డ్ ఫ్లూపై ఆ 2 గ్రామాల్లో డీపీవో, జిల్లా పరిషత్ సీఈవో గ్రామసభలు నిర్వహించాలన్నారు.బయట వ్యక్తులు రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా చికెన్ దుకాణాలను అధికారులు మూసివేశారు.
BirdFlu in Nellore : నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం ! తీవ్ర ఆందోళనలో ప్రజానీకం !
ఫిబ్రవరి 16, 2024
0
Tags