ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అనూహ్య పరిణామం ఎదురైంది. ప్రస్తుతం సీఎం జగన్ ఢల్లీి పర్యటనలో ఉన్నారు. శుక్రవారం పార్లమెంట్‌లో ప్రధాని మోడీతో జగన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా విభజన హామీల అమలు సహా రాజకీయ అంశాలు ప్రధానితో జగన్ చర్చించినట్లు సమాచారం. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల, పోలవరం ప్రాజెక్టుకు నిధులు, విద్యుత్‌కు సంబంధించి బకాయిల క్లియరెన్స్, కేంద్ర వాటా నుంచి ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన పన్ను చెల్లింపులు చేయాలని జగన్ ప్రధాని మోదీని కోరినట్లు సమాచారం. అయితే, ప్రధానితో భేటీ అనంతరం బయటకు వచ్చిన సీఎం జగన్‌పై పలువురు మీడియా ప్రతినిధులు ప్రశ్నల వర్షం సంధించారు. ఈ సందర్భంగా ఓ విలేకరి షాకింగ్ ప్రశ్న అడిగారు.
మీడియా: పీవీ నరసింహారావుకు భారతరత్న రావటం పట్ల మీ స్పందన ఏంటి?
సీఎం జగన్: విజయ సాయిరెడ్డి చెప్తాడు
మీడియా: మీ రాష్ట్ర సీఎం కూడా సాయిరెడ్డేనా!?
అని మీడియా ప్రతినిధి మరో ప్రశ్న సంధించడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక విజయసాయిరెడ్డిపైకి నెట్టివేసే సీఎంను ఎక్కడా చూడలేదంటూ కొందరు విమర్శలు చేస్తుండగా.. మరి కొందరు జగన్ సపోర్టర్స్ మీడియాపై సీరియస్ అవుతున్నారు.
మీడియా: పీవీ నరసింహారావు కు భారతరత్న రావటం పట్ల మీ స్పందన ఏంటి!??
— Team Lokesh (@Srinu_LokeshIst) February 9, 2024
జగన్ రెడ్డి : సాయిరెడ్డి చెప్తాడు
మీడియా: మీ రాష్ట్ర సీఎం కూడా సాయిరెడ్డేనా!?? pic.twitter.com/X4cOlWSF1T