TS Assembley : సాగునీటి జలాలపై అసెంబ్లీ వేదికగా మాటల యుద్ధం !

0

తెలంగాణ శాసనసభ సమావేశాలు ఒకరోజు విరామం తర్వాత తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా జలాలపై తీర్మానం ప్రవేశపెట్టింది. అనంతరం కృష్ణా ప్రాజెక్టులపై వాస్తవాలు - కేసీఆర్‌ ప్రభుత్వం చేసిన తప్పిదాలు అనే పేరుతో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కృష్ణా ప్రాజెక్టులపై ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఈ క్రమంలో కేసీఆర్‌ ప్రభుత్వం వల్ల రాష్ట్రానికి చాలా అన్యాయం జరిగిందని ఆరోపించారు. దీనిపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌ రావు స్పందిస్తూ కాంగ్రెస్‌ నేతల వ్యాఖ్యలను ఖండిరచారు. ఈ నేపథ్యంలో హరీశ్‌ రావుకు, సీఎం రేవంత్‌ రెడ్డికి మధ్య వాడివేడి చర్చ జరిగింది. దక్షిణతెలంగాణ కృష్ణా జలాలపై ఆధారపడి ఉందని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో కృష్ణా జలాలపై చర్చ జరుగుతుంటే ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్‌ చర్చలో పాల్గొనకుండా ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని మండిపడ్డారు. ఆయన రాకుండా హరీశ్‌ రావును పంపి పచ్చి అబద్ధాలు మాట్లాడిస్తున్నారని విమర్శించారు.

కృష్ణా ప్రాజెక్టులను కేఆర్‌​ఎంబీకి అప్పగించే ప్రసక్తే లేదు : మంత్రి ఉత్తమ్‌​

‘బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష నేత ఎందుకు అసెంబ్లీకి రాలేదు. ప్రతిపక్ష నేత ఎందుకు అసెంబ్లీకి వచ్చి మాట్లాడట్లేదు? ఇంత ముఖ్యమైన అంశంపై మాట్లాడేందుకు కేసీఆర్‌ ఎందుకు రాలేదు? కేసీఆర్‌ను అసెంబ్లీకి వచ్చి సమాధానం చెప్పమనండి. కేసీఆర్‌ సభకు వస్తే మీరు ఎంత సేపైనా మైక్‌ ఇవ్వండి. దక్షిణతెలంగాణ కృష్ణా జలాలపై ఆధారపడి ఉంది. ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్‌ చర్చల్లో పాల్గొనలేదు. హరీశ్‌రావు సభలో పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. ఓ వ్యక్తి కరీంనగర్‌ నుంచి తరిమికొడితే మహబూబ్‌నగర్‌ వాసులు ఎంపీగా గెలిపించారని రేవంత్‌ రెడ్డి ఎద్దేవా చేశారు.

రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలను ఖండిరచిన హరీష్‌రావు

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలను హరీశ్‌ రావు ఖండిరచారు. తెలంగాణ ఉద్యమం గురించి రేవంత్‌ మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంటుందని అన్నారు. రేవంత్‌ను కొడంగల్‌ నుంచి తరిమికొడితేనే మల్కాజ్‌గిరికి వచ్చారా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌ ప్రాజెక్టుల అప్పగింత గురించి మాట్లాడిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా జలాల తీర్మానం ప్రవేశపెట్టాలనే నిర్ణయానికి వచ్చిందని పేర్కొన్నారు. ఇది గాంధీ భవన్‌ కాదని శాసనసభ అని, ముఖ్యమంత్రి పదవిలో ఉన్నవారు హుందాగా వ్యవహరించాలని హరీశ్‌ రావు మండిపడ్డారు. సీఎం మాట్లాడిన భాష అభ్యంతరకరంగా ఉందని అన్నారు. ‘కేసీఆర్‌ గురించి కొందరు వ్యక్తిగతంగా తూలనాడుతున్నారు. కేసీఆర్‌ లేకుంటే తెలంగాణ రాష్ట్రం లేదు. కేసీఆర్‌ లేకుంటే రేవంత్‌రెడ్డి సీఎం అయ్యేవారే కాదు. ఒక ఉన్నతమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అసెంబ్లీలో అన్‌పార్లమెంటరీ భాష మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడుతున్న భాష చూసి కొంతమంది మేధావులు మాకు ఫోన్‌ చేసి అడుగుతున్నారు. మీ సీఎం అలా మాట్లాడుతున్నారేంటని మమ్మల్ని అడుగుతున్నారని హరీష్‌రావు పేర్కొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !