- మెయిన్ తొలి సెషన్ ఫలితాల విడుదల
- దేశవ్యాప్తంగా 100 పర్సంటైల్ సాధించిన వారు 23
- తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు 10 మంది.
ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ-మెయిన్ తొలి సెషన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) మంగళవారం ఈ ఫలితాలు ప్రకటించగా, దేశవ్యాప్తంగా 23 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించగా, వారిలో 10 మంది తెలుగు విద్యార్థులు స్థానం సంపాదించారు. 100 పర్సంటైల్ సాధించిన 10 మంది కూడా అబ్బాయిలే కావడం, వారిలో తెలుగు రాష్త్రాలకు చెందిన యం. సాయితేజ, షేక్ సూరజ్, పి. రోహన్‌సాయి, హెచ్. విదిత్, యం. అనూప్, దినేష్ రెడ్డి ఉండడం విశేషం. వీరిలో ఏడుగురు తెలంగాణకు చెందిన వారు కాగా, ముగ్గురు ఏపీకి చెందిన వారు.
నారాయణ హవా
దేశవ్యాప్తంగా 23 మంది 100 పర్సంటైల్ సాధించగా వారిలో 8 మంది నారాయణ విద్యార్థులు కాగా, తెలుగు రాష్ట్రాల నుండి ఆరుగురు నారాయణ విద్యార్థులు ఈ ఘనత సాధించారని నారాయణ నారాయణ కళాశాలల అకడమిక్ డ్కెరెక్టర్ పి. ప్రమీల ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రికార్డు నారాయణకు తప్ప దేశంలో మరి ఏ ఇతర విద్యాసంస్థ సాధించలేదని పేర్కొన్నారు. ఇంజినీరింగ్ ఎంట్రన్స్‌ల శిక్షణకు నారాయణకు నారాయణే సాటి అని మరోసారి ఈ ఫలితాలతో నిరూపించామిని తెలియజేశారు. కాగా తెలంగాణ నుండి ఐదుగురు, ఆంధ్రప్రదేశ్ నుండి ఒకరు, కర్ణాటక నుండి ఒకరు, ముంబై (మహారాష్ట్ర) నుండి ఒకరు ఈ రికార్డు సాధించినట్లు చెప్పారు. ఏప్రిల్‌లో జరిగే మరో విడత జెఈఈ మెయిన్ పరీక్షలోనూ మరింత మంది విద్యార్థులతో 100 పర్సంటైల్ సాధించనున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. హెచ్.విదిత్, దినేష్ రెడ్డి 7 వ తరగతి నుండి, సాయితేజ 8 వ తరగతి నుండి అనూప్ 9 వ తరగతి నుండి నారాయణ స్కూల్స్‌లో చదువుతుండగా, షేక్ సూరజ్ 5 వ తరగతి నుండి నారాయణ స్కూల్‌లో విద్యాభ్యాసం చేసినట్లు తెలుస్తోంది. ఎన్టీఏ విడుదల చేసిన ఫలితాల ప్రకారం గణితం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రంలో పర్సంటైళ్లతో పాటు మొత్తం జేఈఈ మెయిన్ పర్సంటైల్ కూడా తెలుసుకోవచ్చు. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహించిన సెషన్ 1 తుది కీని ఎన్‌టీఏ సోమవారం మధ్యాహ్నం విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రాథమిక కీ, తుది కీ మధ్య మార్పులు చోటుచేసుకున్నాయి. మొత్తం 17 ప్రశ్నలకు కీ మారగా గణితంలో 3 ప్రశ్నలు (రెండు ప్రశ్నపత్రాలు), రసాయనశాస్త్రంలో 3 ప్రశ్నల (3 ప్రశ్నాపత్రాలు)ను తొలగించారు. చివరి విడత (సెషన్ 2) ఏప్రిల్ 4 నుంచి 15 మధ్య నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ ప్రకటించింది. గతంలో ఒకేసారి రెండు విడతలకు దరఖాస్తు చేసిన వారు మళ్లీ ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదని తెలిపింది. మార్చి 2వ తేదీ అర్ధరాత్రి వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ చివరి విడత పూర్తయ్యాక.. రెండిరటిలో ఉత్తమ స్కోర్‌ను పరిగణనలోకి (రెండు విడతలు రాస్తే) తీసుకొని ర్యాంకును కేటాయిస్తారు. తొలి విడత పేపర్-1కు దేశవ్యాప్తంగా మొత్తం 12,21,615 మంది దరఖాస్తు చేసుకోగా.. 11,70,036 మంది విద్యార్థులు (95.8 శాతం) హాజరయ్యారు. ఎన్‌ఐటీల్లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (బీఆర్క్), బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ (బీప్లానింగ్) సీట్ల భర్తీకి జనవరి 24న నిర్వహించిన పేపర్-2 పరీక్షకు 74,002 మంది దరఖాస్తు చేసుకోగా.. 55,493 (75 శాతం) మంది హాజరయ్యారు.
100 పర్సంటైల్ సాధించిన నారాయణ విద్యార్థుల మనోభావాలు !
మొదట్లో మాథ్స్ ఫిజిక్స్ సబ్దెక్టులు నేర్చుకోవడం కష్టంగా అనిపించేది. తర్వాత వాటిని ఎక్కువ సేవు సాధన చేయడం మొదలుపెట్టాను. మా నాన్న ఆంజనేయులు వినుకొందలో రైస్‌మిల్ నిర్వహిన్తున్నారు. అమ్మ లక్ష్మి గృహిణి. నేను 8 వ తరగతి నుండి నారాయణలో చదువుతున్నాను. ఇంటర్ కోసం హైద్రాబాద్ మాదాపూర్ చేశాను. అధ్యాపకుల గైడెన్స్ ఎంతగానో ఉపయోగపడిరది. ఐఐటీ ముంబైలో కంప్యూటర్ సైన్స్ చదవడమే నా లక్ష్యం. - సాయితేజ
.....................................................................................................................................................................
రోజుకి 10 గంటలు కష్టపడుతున్నా
ఇంటర్‌లో చేరాక జేఈఈలో టాప్ ర్యాంకు సాధించాలని నిర్థేశించుకున్నా. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ చదవాలనేది నా కల. దానిని నెరవేర్చుకునేందుకు రోజుకు 10 గంటల పాటు కష్టపడుతున్నా. జేఈఈ మెయిన్‌లో 300/300 మార్కులు రావటం ఆనందంగా ఉంది. అడ్వాన్స్‌డ్‌లోనూ మంచి ర్యాంకు సాధిస్తాననే నమ్మకం ఉంది. పరీక్షల్లో దొర్లిన తప్పులను సవరించుకుంటూ ముందుకు వెళుతున్నా. ఒత్తిడికి గురైనప్పుడు అమ్మానాన్నలతో మాట్లాడుతా. నాన్న రాజేశ్వర్ పబ్బా, అమ్మ లావణ్య పబ్బా నాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. వారి ప్రోత్సాహం లేకుంటే నాకు ఈ ర్యాంకు సాధ్యమమ్యేది కాదు. - రోహన్‌సాయి
.....................................................................................................................................................................
ఎక్కువ సమయం సాధనకే
రోజుకు 16 గంటలపాటు సాధన చేసేవాడిని. అడ్వాన్స్‌డ్‌లో కూడా మంచి ర్యాంకు సాధిస్తాను. ఐఐటీ ముంబైలో కంప్యూటర్ సైన్స్ చదవడమే లక్ష్యంగా పెట్టుకున్నాను. కంప్యూటర్ రంగంలో నూతన ఆవిష్కరణల కోసం నా వంతు కృషి చేస్తాను. మాది జహీరాబాద్ దగ్గర పల్లెటూరు. నాన్న అనిల్‌కుమార్ సాఫ్ట్‌వేర్, అమ్మ మమత ప్రభుత్వ టీచర్. ఇద్దరూ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. వారి ప్రభావంతోనే నేను ఉన్నత స్థితికి రావాలనుకున్నాను. అమ్మ, నాన్న...నాకు ఇన్ఫిరేషన్. - విదిత్
.....................................................................................................................................................................
ఐఐటీ బాంబేలో చదవాలనేది నా కల
జేఈఈ మెయిన్‌లో 100 % పర్సంటైల్ రావటం ఎంతో ఆనందంగా ఉంది. అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంకు సాధిస్తా. బాంబే ఐఐటిలో కంప్యూటర్ సైన్స్ తీసుకుంటా. గ్రామీణ ప్రాంతాలకు నూతన టెక్నాలజీని తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తా. మాది గుంటూరు, హైద్రాబాద్‌లో సెటిల్ అయ్యాం. నాన్న రాజ్‌కుమార్ సాప్ట్‌వేర్, అమ్మ పార్వతి గృహిణి. నేను 9 వ తరగతి నుండి నారాయణ హైటెక్‌సిటీలో చదువుతున్నాను. లెక్చరర్స్ గైడెన్స్, మాక్ టెస్ట్‌లు నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. - అనూప్
.....................................................................................................................................................................
వినూత్న ఆవిష్కరణల కోసం కృషిచేస్తా !
కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అంటే చాలా ఇష్టం. అమ్మా, నాన్నల ప్రోత్సాహం కారణంగానే నేను ఈ స్థాయిలో నిలిచాను. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఇతరులకంటే ఒక గంట అదనపు సమయం కేటాయిస్తా. ప్రణాళికాబద్దంగా వినియోగించుకుని అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు సాధిస్తా. ఐఐటీ ముంబైలో కంప్యూటర్ సైన్స్ చదవాలనేదే లక్ష్యంగా కష్టపడుతున్నాను. అడ్వాన్స్‌లో కూడా మంచి ర్యాంకు సాధించేందుకు సన్నద్ధమవుతున్నాను. నెల్లూరు నారాయణ బ్రహ్మదేవం క్యాంపస్‌లో చదువుకున్నాను. నాన్న షేక్ దరియాసాహేబ్, అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేస్తుంటారు. అమ్మ మల్లీశ్వరీ రిమ్స్‌లో స్టాఫ్‌నర్స్‌గా పనిచేస్తున్నారు. -షేక్ సూరజ్