హైదరాబాద్‌లో మెడికల్ మాఫియా రెచ్చిపోతుంది. అక్రమంగా బ్లడ్ ,ప్లాస్మా సీరం అమ్ముతూ.. మనుషులు ప్రాణాలతో చెలగాటమడుతోంది. తాజాగా మనుషుల రక్తం, ప్లాస్మా అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్న ముఠాను డ్రగ్ కంట్రోల్ అధికారులు పట్టుకున్నారు. నగరంలోని పలు బ్లడ్ బ్యాంకులపై డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు చేపట్టారు. సికిర ఆస్పత్రి బ్లడ్ బ్యాంక్, న్యూలైఫ్ బ్లడ్ సెంటర్, ఆర్‌ఆర్ బ్లడ్ బ్యాంక్‌లో సోదాలు జరిపారు. క్లిమెన్స్, క్లినోవి రీసెర్చ్, నవరీచ్ క్లినిక్, జీ7 ఎనర్జీ, క్యూపీఎస్ బయోసర్వీస్‌లో తనిఖీలు నిర్వహించారు. శిల్ప మెడికల్, జెనీరైస్ క్లినిక్, వింప్టా ల్యాబ్స్‌లోనూ డ్రగ్ అధికారుల దాడులు చేపట్టారు. ముసాపేట బాలాజీనగర్‌లోని హీమో ల్యాబొరేటరీస్‌లో చేపట్టిన తనిఖీల్లో అక్రమంగా బ్లడ్, స్లాస్మా, సీరం నిల్వలను అధికారులు గుర్తించారు. అక్రమంగా హ్యూమన్ ప్లాస్మాలను అమ్ముతున్న ముఠాను అరెస్ట్ చేశారు. సంఘటన స్థలం నుంచి భారీగా ప్లాస్మా యూనిట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. బ్లడ్ బ్యాంకుల ద్వారా సేకరించిన రక్తం నుంచి ప్లాస్మా, సీరం తీసి రీప్యాకింగ్ చేసి విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సేకరించిన హ్యూమన్ ప్లాస్మాను బ్లాక్ మార్కెట్‌లో రూ, వేలకు అమ్ముతున్నట్లు తేలింది. దాదాపు ఎనిమిదేళ్లుగా కేటుగాళ్లు ఈదందా సాగిస్తున్నట్లు సమాచారం.
Hyderabad : మెడికల్ మాఫియా ఆగడాలు.. అక్రమంగా బ్లడ్, సీరం, ప్లాస్మా అమ్మకం
ఫిబ్రవరి 03, 2024
0
Tags