యంగ్ టైగర్ NTR నటిస్తోన్న తాజా చిత్రం.. DEVARA. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. అతని సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది. సైఫ్ అలీ ఖాన్, షైన్ టామ్ చాకో, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ ఇతర నటీనటీలు కీలక పాత్రలను పోషించారు. కొరటాల శివ దర్శకుడు.యువ సుధ ఆర్ట్స్, హీరో నందమూరి కల్యాణ్ రామ్‌కు చెందిన ఎన్టీఆర్ ఆర్ట్స్.. సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తోన్నాయి. అనిరుద్ధ్ రవిచందర్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా రూపుదిద్దుకుంటోంది మూవీ. రెండు భాగాలుగా చిత్రీకరణ జరుపుకొంటోంది. ఆర్‌ఆర్‌ఆర్ బ్లాక్ బస్టర్ హిట్ తరువాత జూనియర్ ఎన్టీఆర్ నుంచి వస్తోన్న సినిమా ఇదే. దీనిపై మంచి అంచనాలు ఉన్నాయి. భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను ఎక్స్‌పెక్ట్ చేస్తోన్నారు అభిమానులు. ఇప్పటికే దేవర ఫస్ట్ లుక్ హైప్ క్రియేట్ చేసింది. భైరవగా సైఫ్ అలీ ఖాన్ గెటప్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.
దసరాకి విడుదల
ఈ మూవీ విడుదల తేదీ వెల్లడయింది. దీనికి సంబంధించిన ఓ పోస్టర్‌ను JR NTR తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఈ ఏడాది అక్టోబర్ 10వ తేదీన ఈ మూవీ విడుదల కానుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అదే నెల 12వ తేదీన విజయదశమి. అంతకంటే ముందే అంటే దుర్గాష్టమి రోజున దేవర విడుదల కానుంది. నిజానికి- ఏప్రిల్ 5వ తేదీన ఫస్ట్ పార్ట్ ఈ విడుదల అవుతుందనే అంచనాలు వ్యక్తం అయ్యాయి మొదట్లో. ఆ తేదీ నాటికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావడానికి సినిమా యూనిట్ కష్టపడిరది గానీ ఫలితం దక్కలేదు. RRR తరువాత అంతకుమించిన స్థాయిలో ఉండేలా దేవరను తీయాలనే ఉద్దేశంలో చిత్రం యూనిట్ ఉంది. DEVARA ఫస్ట్ గ్లింప్సెస్ ఇప్పటికే విడుదల అయ్యాయి. దీనితో పాటు ఓ షార్ట్ టీజర్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వరల్డ్ ఆఫ్ దేవర దీన్ని విడుదల చేశారు నిర్మాతలు. ఈ టీజర్ సినిమాపై మంచి హైప్‌ను క్రియేట్ చేసింది. జూనియర్ నుంచి మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఉంటుందనే అంచనాలు ఉన్నాయి.
#Devara Part 1 releasing on 10.10.24. pic.twitter.com/AK4EvxQBz7
— Jr NTR (@tarak9999) February 16, 2024