PawanKalyan : జగన్‌ మాటలు నమ్మకండి, పొత్తులపై కీలక సూచనలు !

0

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సంచలన కామెంట్స్‌ చేశారు. జేబులోంచి ఒక్క రూపాయి కూడా తీసి ఇవ్వని వ్యక్తి వైఎస్‌ జగన్‌ అని విమర్శించారు. తాము సొంత డబ్బులతో ప్రజలను ఆదుకుంటున్నామని చెప్పారు. బుధవారం నాడు అమరావతిలో పర్యటించిన పవన్‌ కల్యాణ్‌.. ప్రమాదవశాత్తు మృతి చెందిన జనసేన కార్యకర్తల కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్‌.. సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. జగన్‌ చెప్పే మాయ మాటలు నమ్మొద్దని హెచ్చరించారు. జనసేన, టీడీపీ వస్తే సంక్షేమ పథకాలు ఆపేస్తారని ప్రచారం చేస్తున్నారని.. తమ కూటమి ప్రభుత్వం వస్తే ఏ ఒక్క పథకం ఆగదని, అన్ని పథకాలను అమలు చేస్తామని క్లారిటీ ఇచ్చారు పవన్‌ కల్యాణ్‌. తాము అధికారంలోకి వస్తే డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామన్నారు. అలాగే పన్నుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని.. ప్రజలకే పంచుతామని చెప్పారు. జేబులో నుంచి రూపాయి కూడా తీయని వ్యక్తి జగన్‌ అని విమర్శించారు. ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతో సొంత డబ్బులు ఖర్చు చేసి మరీ ప్రజలను ఆదుకుంటున్నామని పవన్‌ చెప్పారు.

పొత్తులపై త్వరలోనే స్పష్టత !

ఏపీలో త్వరలో జరుగబోయే ఎన్నికల్లో పొత్తులపై త్వరలోనే స్పష్టత వస్తుందని, అప్పటి వరకు జనసేన కార్యకర్తలు పార్టీ విధానాలకు భిన్నంగా మాట్లాడవద్దని పవన్‌కల్యాణ్‌ సూచించారు. జనహితం, రాష్ట్ర సమగ్రాభివృద్ధి జనసేన ప్రథమ ప్రాధాన్యమని ఆయన మరోసారి గుర్తుచేశారు. త్వరలో పొత్తులపై స్పష్టం వస్తుందని ఆయన వెల్లడిరచారు.ప్రజలు స్థిరత్వాన్ని కాంక్షిస్తున్నారని, ఈ సమయంలో పార్టీ శ్రేణులంతా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. విస్తృతమైన రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే పొత్తు ను చేసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. పొత్తులపై భిన్నంగా వ్యాఖ్యలు చేసేవారి నుంచి వివరణ తీసుకోవాలని పార్టీ నాయకులకు సూచించారు. పొత్తులపై సందేహాలుంటే నా రాజకీయ కార్యదర్శి దృష్టికి తీసుకురావాలని కోరారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !