Hyd Crime : రియల్‌ వ్యాపారి రామన్న దారుణహత్య !

0

నగరంలో ఓ రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యారు. పది మంది కత్తులతో విచక్షణారహితంగా పొడవడమే కాకుండా అతడి మర్మాంగాలను కోశారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం సింగోటంకు చెందిన పుట్టా రాము అలియాస్‌ సింగోటం రాము అలియాస్‌ రమణ అలియాస్‌ రామన్న(36) రహమత్‌నగర్‌ ప్రాంతంలో నివసించేవాడు. డ్రైవర్‌గా పని చేస్తూ స్థిరాస్తి రంగంలో అడుగుపెట్టాడు. ఈ క్రమంలో మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాల్లో బాగా సంపాదించాడు. అబ్దుల్‌కలాం సామాజిక సేవా సంస్థను ఏర్పాటు చేసి కొల్లాపూర్‌ ప్రాంతంలో వివిధ సేవా కార్యక్రమాలు చేసేవాడు. ఒంటి మీద అర కిలో బంగారు ఆభరణాలు ధరించి ‘గోల్డ్‌మ్యాన్‌’గానూ ప్రసిద్ధి చెందాడు. రాజకీయంగా ఎదగడానికి కొల్లాపూర్‌లోనే ఉంటూ బీజేపీలో చేరాడు. వ్యాపారాన్ని మరింత విస్తరించే క్రమంలో మణికంఠ అనే వ్యక్తితో రాముకు పరిచయం ఏర్పడిరది. అతడితో వ్యాపార లావాదేవీలు పెరగడంతో సన్నిహిత సంబంధాలు కూడా ఏర్పడ్డాయి. ఇద్దరు కలిసి యూసఫ్‌గూడలోని ఎల్‌ఎన్‌నగర్‌లో ఓ మహిళ వద్దకు వెళ్తండేవారు. అక్కడే పేకాట ఆడడం, మద్యం సేవించడం వంటివి చేస్తుండేవారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. ఇప్పుడే అసలు కథ ప్రారంభమైంది. 

లావాదేవీల విషయంలో విబేధాలు 

వ్యాపార లావాదేవీల విషయంలో రాము, మణికంఠ మధ్య విబేధాలు తలెత్తాయి. ఇవి పరస్పరం దాడులు చేసుకునే దాకా వెళ్లాయి. పరస్పరం కేసులు కూడా పెట్టుకున్నారు. రెండేళ్ల క్రితం వ్యాపారంలో విభేదాల కారణంగా మణికంఠపై దాడి చేశాడు. ఈ క్రమంలో మణికంఠ ముఖానికి తీవ్ర గాయాలై ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. ఈ సంఘటనపై పేట్‌బషీరాబాద్‌ ఠాణా పరిధిలో కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. రామన్న యూసుఫ్‌గూడ లక్ష్మీనర్సింహనగర్‌లో నివసించే ఓ మహిళ ఇంటికి తరచూ వెళ్తుండేవాడు. ఆమెపై పలు ఠాణాల్లో వ్యభిచారం కేసులు ఉన్నట్లు సమాచారం. ఆమె కుమార్తెను రామన్న కొంత కాలంగా ఇబ్బంది పెడుతున్నాడు. దీంతో ఆ యువతి తనకు దగ్గరగా ఉండే ఓ యువకుడి దృష్టికి తీసుకెళ్లింది. అతడు మణికంఠకు స్నేహితుడు కావడంతో ఇద్దరూ కలిసి రామన్న హత్యకు పథకం వేశారు.

వ్యాపారంంలో లావాదేవీలే కారణం

రాము మీద కక్ష పెంచుకున్న మణికంఠ అతడిని హత్య చేసేందుకు పథకం పన్నాడు. ఇందుకోసం బోరబండకు చెందిన రౌడీ షీటర్‌కు సుపారీ ఇచ్చాడు. ఆ రౌడీ షీటర్‌ కొంత మంది తన అనుచరులను సిద్ధం చేసుకున్నాడు. పథకం ప్రకారం మణికంఠ ఎల్‌ఆన్‌నగర్‌లోని మహిళ ఇంటికి వెళ్ళాడు. ఆమెతో రాముకు ఫోన్‌ చేయించి పిలిపించాడు. దీంతో రామన్న మద్యం తీసుకొని వెళ్లాడు. వెంటనే ఆమె యువకుడికి సమాచారం అందించింది. అతనితోపాటు మణికంఠ, బోరబండలో నివసించే రౌడీషీటర్‌ జిలానీ సహా మొత్తం పది మంది కత్తులతో అక్కడికి చేరుకున్నారు. రాత్రి 11.45 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా ఇంట్లోకి ప్రవేశించి రామన్నపై పాశవికంగా దాడి చేశారు. అతడి మర్మంగాలను కోసేశారు. దీంతో రక్తపు మడుగుల్లో పడి రాము విలవిలలాడాడు. రాము మృతి చెందాడని నిర్ధారించుకున్న తర్వాతే నిందితులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం మణికంఠ రామన్న బామ్మర్దికి వీడియో కాల్‌ చేసి ‘నీ బావ చనిపోయాడు.. వచ్చి తీసుకెళ్లు’ అంటూ చూపించాడు. అనంతరం వారంతా అక్కడి నుంచి పరారీ కాగా యువతి అక్కడే ఉంది. అర్ధరాత్రి రాంరెడ్డినగర్‌ ప్రాంతానికి చేరుకొన్న మణికంఠ బృందం బాణసంచా కాల్చినట్లు స్థానికులు చెబుతున్నారు. స్థానికుల సమాచారంతో అర్ధరాత్రి దాటిన తర్వాత జూబ్లీహిల్స్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్ల్యూస్‌ టీమ్‌ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. రాము కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గురువారం ఉదయం మణికంఠ, జిలానీ మరో ముగ్గురు కలిసి కత్తులతో పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం. సదరు యువతిని సైతం అదుపులోకి తీసుకొని ఫిల్మ్‌నగర్‌ ఠాణాలో విచారించినట్లు తెలుస్తోంది. మిగతా నిందితులను పట్టుకొనేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ సంఘటనపై పోలీసులు పూర్తి వివరాలు వెల్లడిరచాల్సి ఉంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !