Crime News : రైతు బీమా, రైతు బంధులో దొంగలు పడ్డారు.

0

రైతు బీమా, రైతుబంధు పథకాల ద్వారా దాదాపు రూ.2 కోట్లు స్వాహా చేసిన వ్యవహారంలో రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని సైబరాబాద్‌ ఆర్థిక నేరాల విభాగం(ఈవోడబ్ల్యూ)అధికారులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరిని విచారించినట్లు సమాచారం. 20 మంది బతికున్న రైతులను చంపేసి వారి పేరిట నకిలీ పత్రాలు సృష్టించి బీమా తీసుకున్నారని.. తప్పుడు రికార్డులతో రైతుబంధు నిధులు పొందారని పోలీసులు గుర్తించారు.

ఎల్‌ఐసీ ఫిర్యాదు

రాష్ట్ర ప్రభుత్వం మరణించిన రైతులకు బీమా కింద రూ.5 లక్షలు, రైతుబంధు కింద పెట్టుబడి కోసం ఎకరాకు ఏటా రూ.10 వేల చొప్పున సాయం అందిస్తోంది. దీన్ని రంగారెడ్డి జిల్లా కొందర్గు మండల వ్యవసాయ శాఖలోని కొందరు అవకాశంగా మార్చుకున్నారు. తమ పరిధిలోని రైతుల వివరాలు సేకరించి.. 20 మంది మరణించినట్లు తప్పుడు పత్రాలు సృష్టించారు. వాటి ఆధారంగా బీమాకు దరఖాస్తు చేసి, సుమారు రూ.కోటి స్వాహా చేశారు. పరిహారం చెల్లించే ఎల్‌ఐసీ తమ దగ్గర నమోదయ్యే క్లెయిముల చెల్లింపులకు సంబంధించి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపడుతుంది. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలంలో రూ.కోటికిపైగా బీమా పరిహారం పక్కదారి పట్టినట్లు గుర్తించింది. ముంబయిలోని ప్రధాన కార్యాలయం ఇచ్చిన సమాచారంతో అధికారులు సైబరాబాద్‌ ఈవోడబ్ల్యూలో ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో 2020 నుంచి ఈ అక్రమాలు జరుగుతున్నట్లు వెల్లడైంది. ఈ కేసు విచారణ క్రమంలోనే రైతుబంధు నిధులు రూ.కోటి పక్కదారి పట్టినట్లు వెలుగులోకి వచ్చింది. రైతుల పేరుతో నకిలీ ఖాతాలు తెరచి దొడ్డిదారిలో నిధులు కాజేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మొత్తం రూ.2 కోట్లు కొట్టేసిన వ్యవహారంలో వ్యవసాయ విస్తరణ అధికారి ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు తేలడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. కొందుర్గు మండల పరిధిలోని ఇద్దరు పంచాయతీ కార్యదర్శులను విచారించినట్లు తెలుస్తోంది.

తప్పుడు పత్రాలతో బీమా డబ్బులు స్వాహా 

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రైతు బంధు, రైతు బీమా కుంభకోణం కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వ్యవసాయ విస్తరణాధికారి శ్రీశైలం సహా క్యాబ్‌ డ్రైవర్‌ ఓదెల వీరాస్వామిని అదుపులోకి తీసుకున్నారు. 20 మంది రైతులు మరణించినట్లుగా తప్పుడు పత్రాలు సృష్టించి బీమా డబ్బులు స్వాహా చేశారని పోలీసులు వెల్లడిరచారు. ఈ కుంభకోణంపై ఆర్థిక నేరాల విభాగం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని సైబరాబాద్‌ సీపీ అవినాష్‌ మహంతి తెలిపారు.‘‘కొందుర్గు మండలానికి చెందిన రైతు బంధు, రైతు బీమా నిధులు దారిమళ్లాయి. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి ఫిర్యాదు చేశారు. 20 మంది రైతులకు సంబంధించి నకిలీ పత్రాలతో రైతు బీమా, 130 మంది పేరిట రైతుబంధు నిధుల మళ్లింపు జరిగింది. నిందితుడు తన మిత్రుడితో 7 బ్యాంకు ఖాతాలు తెరిపించాడు’’ అని సీపీ వివరించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !