టీడీపీ-జనసేన అభ్యర్థుల తొలి జాబితాను ఆయా పార్టీల అధ్యక్షులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రకటించారు 118 అసెంబ్లీ స్థానాలకు టీడీపీ-జనసేన కూటమి ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించారు. అయితే, ఫస్ట్ లిస్ట్ అనౌన్స్‌కి ముందు అటు చంద్రబాబు.. ఇటు పవన్ కల్యాణ్ ఇద్దరూ కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉండవల్లి నివాసంలో టీడీపీ ముఖ్యనేతలతో చంద్రబాబు చర్చలు జరిపారు. అలాగే, మంగళగిరి జనసేన ఆఫీస్‌లో ముఖ్యనేతలతో భేటీ అయ్యారు పవన్ కల్యాణ్. అనంతరం పవన్ కళ్యాణ్ ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటికి వెళ్లారు. రాష్ట్రాన్ని నాశనం చేసిన వైసీపీ నుంచి ప్రజలకు విముక్తి కలిగించేందుకు తెలుగుదేశం-జనసేన పూనకున్నాయని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర బంగారు భవిష్యత్ కోసం రెండు పార్టీలు తపిస్తున్నాయని, బీజేపీ ఆశీస్సులు తమకు ఉన్నాయని ఇరు నేతలు వెల్లడిరచారు. టీడీపీ-జనసేన విడుదల చేసిన ఈ జాబితాలో సీనియర్లకే పెద్ద పీఠ వేసినట్లు కనిపిస్తుంది. పార్టీ, ప్రాంతాలపై పట్టు ఉన్నవారికే అధినేత చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. చాలా మంది పాతవారే మళ్లీ టిక్కెట్లు దక్కించుకున్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కుప్పం నుంచి మరోసారి పోటీకి దిగనున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ భీమవరం నుంచి లోకేశ్ మంగళగిరి బరిలో ఉన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు టెక్కలి నుంచి పోటీకి దిగుతుండగా, నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి పోటీకి సిద్దమవుతున్నారు.
జనసేన అభ్యర్థులు..
- నెల్లిమర్ల- లోకం మాధవి
- అనకాపల్లి- కొణతాల రామకృష్ణ
- రాజానగరం- బత్తుల బలరామకృష్ణ
- కాకినాడ రూరల్- పంతం నానాజీ
- తెనాలి- నాదెండ్ల మనోహర్
తెలుగుదేశం అభ్యర్థుల జాబితా..
- ఇచ్ఛాపురం- బెందాళం అశోక్
- టెక్కలి-అచ్చెన్నాయుడు
- ఆమదాలవలస-కూన రవికుమార్
- రాజాం-కోండ్రు మురళి
- కురుపాం - తొయ్యక జగదీశ్వరి
- పార్వతీపురం - విజయ్ బోనెల
- సాలూరు - గుమ్మడి సంధ్యారాణి
- బొబ్బిలి-ఆర్‌ఎస్‌వీకేకే రంగారావు (బేబి నాయన)
- గజపతినగరం - కొండపల్లి శ్రీనివాస్
- విజయనగరం - అదితి గజపతిరాజు
- విశాఖ ఈస్ట్ - వెలగపూడి రామకృష్ణబాబు
- విశాఖ వెస్ట్ - పీజీవీఆర్ నాయుడు
- అరకు - సియ్యారి దొన్ను దొర
- పాయకరావుపేట - వంగలపూడి అనిత
- నర్సీపట్నం - చింతకాయల అయ్యన్నపాత్రుడు
- తుని-యనమల దివ్య
- పెద్దాపురం - నిమ్మకాయల చినరాజప్ప
- అనపర్తి - నల్లిమిల్లి రామకృష్ణ రెడ్డి
- ముమ్మిడివరం - దాట్ల సుబ్బరాజు
- పి.గన్నవరం - రాజేశ్ కుమార్
- కొత్తపేట - బండారు సత్యానంద రావు
- మండపేట - జోగేశ్వరరావు
- రాజమండ్రి సిటీ - ఆదిరెడ్డి వాసు
- జగ్గంపేట - జ్యోతుల వెంకట అప్పారావు (నెహ్రూ)
- ఆచంట - పితాని సత్యనారాయణ
- పాలకొల్లు - నిమ్మల రామానాయుడు
- ఉండి - మంతెన రామరాజు
- తణుకు - అరిమిల్లి రాధాకృష్ణ
- ఏలూరు - బడేటి రాధాకృష్ణ
- చింతలపూడి - సోంగ రోషన్
- తిరువూరు - కొలికపూడి శ్రీనివాస్
- నూజివీడు - కొలుసు పార్థసారథి
- గన్నవరం - యార్లగడ్డ వెంకట్రావు
- గుడివాడ - వెనిగండ్ల రాము
- పెడన - కాగిత కృష్ణ ప్రసాద్
- మచిలీపట్నం - కొల్లు రవీంద్ర
- పామర్రు - వర్ల కుమార రాజ
- విజయవాడ సెంట్రల్ - బోండ ఉమ
- విజయవాడ ఈస్ట్ - గద్దె రామ్మోహన రావు
- నందిగామ - తంగిరాల సౌమ్య
- జగ్గయ్యపేట - శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య
- తాడికొండ - తెనాలి శ్రవణ్ కుమార్
- మంగళగిరి - నారా లోకేశ్
- పొన్నూరు - ధూళిపాళ్ల నరేంద్ర
- వేమూరు(ఎస్సీ) - నక్కా ఆనంద్‌బాబు
- రేపల్లె - అనగాని సత్యప్రసాద్
- బాపట్ల - వి.నరేంద్ర వర్మ
- ప్రత్తిపాడు(ఎస్సీ) - బూర్ల రామాంజినేయులు
- చిలకలూరిపేట - ప్రత్తిపాటి పుల్లారావు
- సత్తెనపల్లి - కన్నా లక్ష్మినారాయణ
- వినుకొండ - జీవీ ఆంజనేయులు
- మాచర్ల - జూలకంటి బ్రహ్మానందరెడ్డి
- యర్రగొండపాలెం (ఎస్సీ) - గూడూరి ఎరిక్సన్ బాబు
- పర్చూరు - ఏలూరి సాంబశివరావు
- అద్దంకి - గొట్టిపాటి రవికుమార్
- సంతనూతలపాడు (ఎస్సీ) - బొమ్మాజి నిరంజన్ విజయ్‌కుమార్
- ఒంగోలు - దామచర్ల జనార్దనరావు
- కొండపి - డోలా బాల వీరాంజనేయస్వామి
- కనిగిరి - ముక్కు ఉగ్రనరసింహారెడ్డి
- కావలి - కావ్య కృష్ణారెడ్డి
- నెల్లూరు సిటీ - పి. నారాయణ
- నెల్లూరు రూరల్ - కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
- గూడూరు (ఎస్సీ) - పాశం సునీల్‌కుమార్
- సూళ్లూరుపేట (ఎస్సీ) - నెలవేల విజయశ్రీ
- ఉదయగిరి - కాకర్ల సురేశ్
- కడప - మాధవిరెడ్డి
- రాయచోటి - మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి
- పులివెందుల- మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి
- మైదుకూరు - పుట్టా సుధాకర్ యాదవ్
- ఆళ్లగడ్డ - భూమా అఖిలప్రియ
- శ్రీశైలం - బుడ్డా రాజశేఖర్‌రెడ్డి
- కర్నూలు - టీజీ భరత్
- పాణ్యం - గౌరు చరితా రెడ్డి
- నంద్యాల - ఎన్‌ఎండీ ఫరూక్
- బనగానపల్లి - బీసీ జనార్దనరెడ్డి
- డోన్ - కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి
- పత్తికొండ - కేఈ శ్యాంబాబు
- కోడుమూరు - బొగ్గుల దస్తగిరి
- రాయదుర్గం - కాలవ శ్రీనివాసులు
- ఉరవకొండ - పయ్యావుల కేశవ్
- తాడిపత్రి - జేసీ అస్మిత్ రెడ్డి
- శింగనమల (ఎస్సీ) - బండారు శ్రావణి శ్రీ
- కల్యాణదుర్గం - అమిలినేని సురేంద్రబాబు
- రాప్తాడు - పరిటాల సునీత
- మడకశిర (ఎస్సీ) - ఎం.ఈ. సునీల్‌కుమార్
- హిందూపురం - నందమూరి బాలకృష్ణ
- పెనుకొండ - సవిత
- తంబళ్లపల్లె - జయచంద్రారెడ్డి
- పీలేరు - నల్లారి కిశోర్‌కుమార్ రెడ్డి
- నగరి - గాలి భానుప్రకాశ్
- గంగాధర నెల్లూరు (ఎస్సీ) - డాక్టర్ వీఎం. థామస్
- చిత్తూరు - గురజాల జగన్ మోహన్
- పలమనేరు - ఎన్.అమర్‌నాథ్‌రెడ్డి
- కుప్పం - నారా చంద్రబాబు నాయుడు