తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బీఆర్‌ఎస్ పాలనపై గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు చేశారు. కాళోజీ కవితతో గవర్నర్ తమిళిసై అసెంబ్లీలో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రగతిభవన్ కంచెను తొలగించాం. ప్రజాభవన్ లో ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రజలకు అనుమతి లభించిందన్నారు. ఈ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందన్నారు. రాష్ట్ర ప్రజలు ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేశారన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలను సకాలంలో అమలు చేస్తామన్నారు. రాష్ట్రాన్ని అప్పుల మయం చేసి మాకు అప్పగించారని బీఆర్‌ఎస్‌కు చురకలు అంటించారు. ధనిక రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. రాష్ట్రాన్ని పునర్నిమించే ప్రయత్నం చేస్తున్నాం.ఆరు గ్యారంటీల్లో రెండు గ్యారంటీలను అమలు చేశామన్నారు. త్వరలో మరో రెండు గ్యారంటీలను అమలు చేస్తాం. అర్హులకు రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తాం. ప్రస్తుతం తెలంగాణలో ప్రజల కొరకు, ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం ఉంది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్, 2 లక్షల ఉద్యోగాలపై ఫోకస్ చేశామన్నారు. ప్రజలపై భారం వేయకుండా ఆర్థిక వ్యవస్థను చక్కబెడతామన్నారు. మహాలక్ష్మీ పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామన్నారు. దశాబ్ధ కాలంలో నష్టపోయిన సంస్థలను తిరిగి కోలుకునేలా చేస్తామన్నారు.
- ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
- కాళోజీ కవితతో ప్రసంగాన్ని గవర్నర్ తమిళిసై ప్రారంభించారు.
- ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రగతిభవన్ కంచెను తొలగించామన్నారు.
- ఆరు గ్యారంటీల అమలుకు కట్టుబడి ఉన్నాం అని పేర్కొన్నారు.
- త్వరలో మరో రెండు గ్యారంటీలను అమలు చేస్తామన్నారు.
- అర్హులకు రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తామన్నారు.
- మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాం.
- రైతులు, మహిళలు, యువతకు ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి ఉన్నాం.
- రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి మాకు అప్పగించారు.
- రాష్ట్రాన్ని పునర్‌నిర్మించే ప్రయత్నం చేస్తున్నాం.
- దశాబ్ధకాంలో నష్టపోయిన సంస్థలను తిరిగి కోలుకునేలా చేస్తాం.
- ధనిక రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు.
- TSPSC, SHRC వంటి సంస్థలు బాధ్యతాయుతంగా పనిచేసే స్వేచ్ఛను కల్పిస్తాం.
- గత సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేశాం.
- ప్రజావాణి ద్వారా ప్రభుత్వం ప్రజా సమస్యలను తెలుసుకుంటోంది.
- ప్రజాపాలనలో కోటి 80 లక్షల దరఖాస్తులు వచ్చాయి.
- ప్రజలపై భారం వేయకుండా ఆర్థిక వ్యవస్థను సరిదిద్దుతాం.
- తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యం కోసం పోరాడారు.
- ప్రజాపాలనలో గ్రామ సభలు నిర్వహిస్తున్నాం.
- వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా కొత్త పారిశ్రామిక విధానం.
- మౌళిక వసతుల రంగాన్ని అభివృద్ధి చేస్తాం.
- ఇంటర్నెట్ కనీస అవసరంగా గుర్తించి అందించే ప్రయత్నం చేస్తున్నాం.
- టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేస్తున్నాం.
- మూసీని అభివృద్ధి చేసి ఉపాధి కల్పిస్తాం.
- దేశానికి హైదరాబాద్‌ను ఏఐ రాజధానిగా మార్చే ప్రయత్నం చేస్తున్నాం.
- కొత్తగా రూ.40వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు.
- చిన్న పరిశ్రమల అభివృద్ధి కోసం కొత్త ఎంఎస్‌ఎంఈ పాలసీ.
- వెయ్యి ఎకరాల్లో 10-12 ఫార్మా విలేజీలు.
- మూసీ నది ప్రక్షాళనలకు ప్రణాళిక రూపొందించాం.
- ఎకో ఫ్రెండ్లీ టూరిజం హబ్‌గా హుస్సేన్‌సాగర్, లక్నవరం
- త్వరలో గ్రీన్ ఎనర్జీని తీసుకువస్తాం.
- ప్రతీ ఇంటికి ఇంటర్నెట్ అందిస్తాం.
- టూరిజం అభివృద్ధికి ప్రత్యేక పాలసీ తీసుకువస్తాం.
అయితే ఈసారి బడ్జెట్ సమావేశాలు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్‌ఎస్‌గా మారే అవకాశముంది.కాగా.. 10వ తేదీన (శనివారం) ప్రభుత్వం శాసనసభలో ఓట్-ఆన్-అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. డిప్యూటీ సీఎం, ఆర్థిక, విద్యుత్తు శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. శాసన మండలిలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రవేశపెట్టవచ్చని తెలిసింది. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా శాసనసభా వ్యవహారాల మంత్రిగా వేముల ప్రశాంత్‌రెడ్డి మండలిలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టేవారు. దుద్దిళ్ల ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తారని సమాచారం. 11న ఆదివారం శాసన సభకు సెలవు ప్రకటించి, బడ్జెట్‌పై సభ్యులకు అధ్యయనం చేసే అవకాశమిస్తారని తెలిసింది. తిరిగి 12న అసెంబ్లీ ప్రారంభమయ్యాక బడ్జెట్‌పై చర్చ చేపట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ చర్చ ఎన్ని రోజులపాటు జరిగేదీ శాసన సభా వ్యవహారాల కమిటీ(బీఏసీ) సమావేశంలో నిర్ణయించనున్నారు. ప్రభుత్వ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ సమావేశాలు 17వ తేదీ వరకూ కొనసాగుతాయని తెలిసింది. ప్రభుత్వం ఈ సెషన్స్‌లోనే సాగునీటి పారుదల శాఖపై శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టనుంది. దీనిపై ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్‌రెడ్డి, సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడే అవకాశముంది. కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పగించడంపై చర్చ జరిగే అవకాశముంది. ఇది కాకుండా... కుల గణనపైనా ప్రభుత్వం ఈ సమావేశాల్లోనే బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు తెలిసింది.