నెల్లూరు వైసీపీలో భారీ కుదుపు ! రాజీనామా చేసిన ఎంపీ వేమిరెడ్డి !

0

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార వైఎస్సార్‌సీపీకి గట్టి షాక్‌ తగిలింది. రాజ్యసభ ఎంపీ, నెల్లూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఆ పార్టీ ముఖ్యనేత వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి రాజీనామా చేశారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు జిల్లా అధ్యక్ష పదవికి రిజైన్‌ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం జగన్‌కి ఆయన లేఖ రాశారు. ‘‘ ఆర్యా.. నేను నా వ్యక్తిగత కారణాల వలన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరి జిల్లా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిలా పార్టీ అధ్యక్ష పదవికి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. ఈ సందర్భంగా మీరు నాకు పార్టీలో అందజేసిన సహకారానికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’’ అంటూ పార్టీకి రాజీనామా లేఖలో వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి పేర్కొన్నారు. ఇక రాజ్యసభ ఎంపీ పదవి కూడా వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి రాజీనామా చేశారు. ‘‘ నేను, నా వ్యక్తిగత కారణాల వలన నా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని తెలియజేస్తున్నాను’’ అంటూ ఎంపీ పదవి రాజీనామా చేసిన లేఖలో పేర్కొన్నారు. 

వేమిరెడ్డికి ప్రాధాన్యత లేదు.

ఇదిలావుండగా వేమిరెడ్డి భార్య ప్రశాంతి కూడా అధికార పార్టీకి బైబై చెప్పేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె టీటీడీలో కీలక పదవిలో ఉన్నారు. అయితే వీరిద్దరూ రాజకీయ భవిష్యత్‌ ప్రణళికలపై క్లారిటీ రావాల్సి ఉంది. తన రాజీనామాను తక్షణమే ఆమోదించాలని కోరారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరఫున నెల్లూరు పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు ఆయన గతంలో ప్రకటన చేశారు. తదనంతర పరిణామాల్లో పేరుకు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారే తప్ప.. ఆయనకు కనీస గౌరవం దక్కలేదని వేమిరెడ్డి అనుచరులు బహిరంగంగా చెబుతున్నారు. అందుకు తగ్గట్టుగానే అధిష్ఠానం అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల మార్పు విషయంలో ప్రాధాన్యం ఇవ్వలేదు. ఇటీవల నెల్లూరు నగర సమన్వయకర్తగా ఎం.డి.ఖలీల్‌ను నియమించిన విషయమై కనీస సమాచారం ఇవ్వకపోవడంతో వేమిరెడ్డి తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అప్పటి నుంచి వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన.. ఆ పార్టీని వీడేందుకు సిద్ధపడ్డారు. ఈక్రమంలోనే పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !