సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో.. ప్రధాన పార్టీలన్ని తమ సత్తా చాటేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. గెలిచేందుకు ఏం చేయాలనే దానిపై ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగితే ఏ రాష్ట్రంలో ఏ పార్టీకి ఓటర్లు పట్టం కడతారనే దానిపై టైమ్స్ నౌ సర్వే చేసింది. ఆ సర్వే తాలూకూ ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. సార్వత్రిక ఎన్నికలతో పాటుగా ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి.
విపక్ష కూటమికి 6 ఎంపీ స్థానాలు
ఈ నేపథ్యంలో తాజాగా సర్వే ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. టైమ్స్ నౌ మ్యాట్రిజ్ సర్వేలో ఏపీలో ఈ సారి వైసీపీ గాలి వీస్తుందని వెల్లడైంది. కేవలం ఎంపీ సీట్ల వరకే సర్వే చేసిన నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో.. ఆంధ్రప్రదేశ్‌లో 25 ఎంపీ సీట్లకు గానూ వైఎస్‌ఆర్సీపీ 19 స్థానాల్లో విజయం సాధిస్తుందని టైమ్స్ నౌ మ్యాట్రిజ్ సర్వే అంచనా వేసింది. విపక్ష జనసేన, టీడీపీ కూటమికి ఆరు ఎంపీ స్థానాలు దక్కొచ్చని అంచనా వేసింది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ ఏపీలో ఖాతా తెరవడం కష్టమేనని టైమ్స్ నౌ మ్యాట్రిజ్ సర్వే వెల్లడిరచింది. ఇదే సమయంలో ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి అద్భుత పనితీరు కనబరుస్తున్నారని సర్వేలో వెల్లడైంది. టైమ్స్ నౌ మ్యాట్రిజ్ సర్వేలో ఏపీ సీఎం జగన్ పనితీరు అద్భుతంగా ఉందని 38 శాతం మంది అభిప్రాయపడ్డారు.మరో 26 శాతం మంది ప్రజలు జగన్ పరిపాలన బాగుందని సంతృప్తి వ్యక్తం చేశారు. 34 శాతం మంది జగన్ పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేయగా.. రెండు శాతం మంది ఏమీ చెప్పలేమని వెల్లడిరచినట్లు టైమ్స్ నౌ మ్యాట్రిజ్ సర్వే తెలిపింది.
Times Now @Matrize_NC Survey:
— TIMES NOW (@TimesNow) February 7, 2024
Lok Sabha seat predictions for Andhra Pradesh -
Total seats: 25
YSRCP: 19
TDP- Jana Sena: 6
Congress: 0
BJP: 0
Other: 0
Watch as @navikakumar takes us through Lok Sabha seat predictions for more South Indian states. pic.twitter.com/bWCCXuvZfC