AP లో టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు పొడిచింది !

0


బీజేపీతో పొత్తులు పొడిచాయి. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుంది. తెలుగుదేశంతో బీజేపీకి పొత్తు ఇష్టం లేకపోయినప్పటికీ జనసేన అధినేత ఒత్తిడితో బీజేపీ అధిష్టానం దిగివచ్చింది. 2014 తర్వాత మరోసారి ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయి. సీట్ల సర్దుబాటుపై ఆయా పార్టీలు త్వరలో ప్రకటింనున్నాయి.  వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్‌ 30 ఏళ్లు వెనక్కి వెళ్లింది. రాష్ట్ర అభివృద్ధి.. దేశ ప్రయోజనాల కోసమే పొత్తు ఉంటుంది. పొత్తులు అనగానే సీఎం జగన్మోహన్‌ రెడ్డిలో భయం మొదలైంది’ అని తెలుగుదేశం రాజ్యసభ ఎంపీ కనమేడల వివరించారు. అమిత్‌ షా నివాసంలో సుమారు 50 నిమిషాలకు పైగా జరిగిన కీలక భేటీలో పొత్తు, సీట్ల పంపకాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు టీడీపీ ఎంపీ చెప్పారు. 

ఇప్పుడిదే చర్చ!!  

కాగా.. మూడ్రోజులుగా ఢల్లీి వేదికగా కీలక పరిణామాలే చోటుచేసుకుంటున్నాయి. అమిత్‌ షా, నడ్డాలతో చంద్రబాబు, పవన్‌ వరుస భేటీలతో అందరి చూపు ఢల్లీిపైనే పడిరది. ఢల్లీిలో ఏం జరుగుతోంది..? బీజేపీతో పొత్తు పొడిచిందా..? లేదా..?.. పొత్తు కుదిరితే ఎన్ని సీట్లు ఇవ్వొచ్చు..? అనేదానిపై గల్లీ మొదలుకుని ఢల్లీి వరకూ ఏ ఇద్దరు కలిసినా ఇదే చర్చ నడుస్తోంది. సీన్‌ కట్‌ చేస్తే.. పొత్తు పొడిచింది.. దాదాపు లెక్కలు కూడా తేలిపోయాయి. మరోసారి భేటీతో బీజేపీకి ఇచ్చే సీట్ల పంపకాలపై ఫుల్‌ క్లారిటీ వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. మొత్తమ్మీద పొత్తుపై అధికారిక ప్రకటన మాత్రమే మిగిలుందన్న మాట. మరి ప్రకటన ఎప్పుడు వస్తుందో.. ఏయే సీట్లు బీజేపీకి దక్కుతాయో వేచి చూడాల్సిందే.

బీజేపీకి 6 లోక్‌సభ, 6 అసెంబ్లీ 

అయితే పొత్తులో భాగంగా బీజేపీ 6 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. జనసేన 2 స్థానాల్లో బరిలో దిగనున్నట్లు సమాచారం. ఇక మిగిలిన 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో తెలుగు దేశం పోటీ చేయనుంది. ఇక 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన 24 నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని ఇప్పటికే పవన్‌ కల్యాన్‌, చంద్రబాబు కలిసి ప్రకటించారు. తాజాగా బీజేపీతో పొత్తు కుదిరితే ఆ పార్టీ ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసే అవకాశం ఉంది. మిగిలిన 145 స్థానాల్లో టీడీపీనే బరిలో దిగనుంది. అయితే బీజేపీ వైజాగ్‌, విజయవాడ, అరకు, రాజంపేట్‌, రాజమండ్రి, తిరుపతి స్థానాలపై దృష్టి పెట్టింది. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో 370 సీట్లు కైవసం చేసుకునే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో బీజేపీ పొత్తులు కుదుర్చుకుంటోంది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !