AmitSha : మూడోసారి కూడా మోదీయే అంటున్నారు.

0

బీజేపీ తెలంగాణ సోషల్‌ మీడియా వారియర్స్‌ సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొద్ది రోజుల్లోనే పార్లమెంట్‌ ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు. సోషల్‌ మీడియాతో ప్రతి ఇంటికి మన సందేశం వెళ్ళాలి.. దేశ ప్రజలు మూడోసారి మోడీని ప్రధానిగా ఎన్నుకోబోతున్నారని పేర్కొన్నారు. రైతులు, పేదలు.. ఎవరి దగ్గరికి వెళ్లినా మోడీ మోడీ అంటున్నారని చెప్పారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పై వేల కోట్ల అవినీతి ఆరోపణలు వచ్చాయి.. కానీ మోడీ పై అవినీతి ఆరోపణలు లేవని అన్నారు. పదేళ్లలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని అమిత్‌ షా పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 370 స్థానాల్లో గెలుపొందాలని భావిస్తోంది. అందుకు అనుగుణంగా పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు అమిత్‌షా. ఎల్‌బీ స్టేడియంలో బీజేపీ పోలింగ్‌ బూత్‌ కమిటీల అధ్యక్షులు, ఆపై మండల స్థాయి నాయకులు, జిల్లా కమిటీల అధ్యక్షులు, నాయకులు పార్టీ కార్యకర్తలకు అమిత్‌ షా మార్గనిర్దేశం చేస్తారు. తెలంగాణ వ్యాప్తంగా 32 వేల పోలింగ్‌ బూత్‌లు ఉండడంతో ఈ బూత్‌ కమిటీల అధ్యక్షులు, ఇన్‌చార్జిలు, ఇతరనాయకులు.. మొత్తం దాదాపు 50-60 వేల మంది వరకు ఈ సమ్మేళనానికి హాజరయ్యారు.


బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, యంఐయం పార్టీ అజెండా ఒక్కటే ! 

దివ్యమైన రామ మందిరం నిర్మాణం చేసుకున్నాం.. కాశ్మీర్లో 370 రద్దు చేసుకున్నాం.. ట్రిపుల్‌ తలాక్‌ తెచ్చాం.. లక్షల మంది ముస్లిం తల్లుల బాధ అర్థం చేసుకుని త్రిపుల్‌ తలాక్‌ తెచ్చాం.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు తెచ్చాం.. ఇప్పుడు సిఏఏ తెచ్చామని అమిత్‌ షా పేర్కొన్నారు. కాంగ్రెస్‌ సిఏఏకు వ్యతిరేకం.. కాంగ్రెస్‌ కి నాగరికత లేదని విమర్శించారు. కాంగ్రెస్‌వి ఓటు బ్యాంకు రాజకీయాలు అని మండిపడ్డారు. పదేళ్ళలో ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చింది మోడీ సర్కార్‌ అని అమిత్‌ షా తెలిపారు. బీఆర్‌ఎస్‌, ఎంఐఎం, కాంగ్రెస్‌ అజెండా ఒక్కటేనని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తెలిపారు. మూడు పార్టీల జెండాలు వేరు.. అజెండా ఒక్కటేనని ఆరోపించారు. ముస్లిం రిసేర్వేషన్‌ లు ఎత్తివేస్తాం.. కాంగ్రెస్‌ ఎత్తేయగలుగుతుందా..? అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ అంటే భారతీయ భ్రష్టాచార్‌ సమితి అని అభివర్ణించారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ నేతలు లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని కీలక ఆరోపణలు చేశారు. నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ ప్రజలను నిండా ముంచిందని అన్నారు. బీఆర్‌ఎస్‌ లక్షల కోట్ల అవినీతికి పాల్పడిరదని అన్నారు. దాని చిట్టా అంతా తమ దగ్గర ఉందని.. తెలంగాణ వికసిత్‌ అజెండా లేదు వాళ్ళ దగ్గర అని ఆరోపించారు. మరోవైపు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ కూడా కుంభకోణాల పార్టీ అని విమర్శించారు. దేశంలో కాంగ్రెస్‌ పార్టీ రూ.12 లక్షల కోట్ల అవినీతికి పాల్పడిరదని తెలిపారు. సీఎం రేవంత్‌ రెడ్డికి దమ్ముంటే తాము చెప్పేది అవాస్తమని చెప్పాలని డిమాండ్‌ చేశారు.  ఉమ్మడి ఏపీకి సోనియా, మన్మోహన్‌ సింగ్‌ లు పదేళ్ళలో 2 లక్షల కోట్లు ఇచ్చారు.. మోడీ 12 లక్షల కోట్లు వెచ్చించారు తెలంగాణకు అని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీలను కాంగ్రెస్‌ అమలు చేయాలని అన్నారు. కోడ్‌ పేరుతో తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. అసలు ఇచ్చిన గ్యారంటీలు ఎప్పుడు అమలు చేస్తారో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాలు చేసి.. రాజకీయంగా లబ్ధిపొందేందుకే ఈ పార్టీలు పనిచేస్తాయని ఎద్దేవా చేశారు. మోడీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులు అందరికీ న్యాయం చేస్తున్నామని వెల్లడిరచారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !