RC 16 : రామ్‌చరణ్‌, జాన్వీకపూర్‌ల కాంబినేషన్‌ మూవీ ప్రారంభోత్సవం !

0

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. రామ్‌ చరణ్‌ తన నెక్ట్స్‌ పాన్‌ ఇండియా చిత్రం కోసం యంగ్‌ ట్యాలెంటెడ్‌ డైరెక్టర్‌ ,ఉప్పెన ఫేమ్‌ బుచ్చిబాబు సాన ‘ఆర్‌సీ 16’ అనే ప్రాజెక్ట్‌ కోసం ఇద్దరు చేతులు కలిపారు.. ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ నటించనుండగా తాజాగా ఈ ప్రాజెక్ట్‌ బుధవారం పూజా కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. ఈ సినిమా లాంఛింగ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌లో ఘనంగా జరుగగా.. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా ఆస్కార్‌ అవార్డు విజేత ఏ.ఆర్‌ రెహమాన్‌తో పాటు, మెగాస్టార్‌ చిరంజీవి, అల్లు అరవింద్‌, బోనీ కపూర్‌ రామ్‌ చరణ్‌ సందడి చేశారు. మరోవైపు ఈ సినిమాకు ‘పెద్ది’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఉత్తరాంధ్ర స్పోర్ట్స్‌ బ్యాగ్‌డ్రాప్‌తో వస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీమూవీ మేకర్స్‌ సమర్పిస్తున్నది. వృద్ధి సినిమాస్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలపై వెంకటసతీశ్‌ కిలారు అత్యంత భారీ వ్యయంతో నిర్మించనున్నారు. యూనివర్సల్‌ అప్పీల్‌ ఉండే పవర్‌ఫుల్‌ స్క్రిప్ట్‌ని బుచ్చిబాబు సిద్ధం చేశారని యూనిట్‌ సభ్యులు తెలిపారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ మొదలు కానుంది. ఈ సినిమా ప్రారంభోత్సవానికి సంబంధించిన ఫొటోలను మెగా ఫ్యాన్స్‌ షేర్‌ చేస్తూ.. టీమ్‌కు శుభాకాంక్షలు చెబుతున్నారు.బుచ్చిబాబు యూనివర్సల్‌ అప్పీల్‌ ఉండే పవర్‌ఫుల్‌ స్క్రిప్ట్‌ని సిద్ధం చేశారు. ఆస్కార్‌ అవార్డ్‌ విన్నింగ్‌ కంపోజర్‌ ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే మేకర్స్‌ తెలియజేయనున్నారు.



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !