మద్యం పాలసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టయ్యారు. గురువారం సాయంత్రం సీఎం నివాసానికి చేరుకున్న ఈడీ బృందం.. ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటించింది. ఈ అరెస్టులో లిక్కర్ పాలసీ కేసులో అరెస్టైన ఆప్ నేతల సంఖ్య 4కి చేరింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన సత్యేందర్ జైన్, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ అరెస్ట్ కాగా ప్రస్తుతం కేజ్రీవాల్ కూడా అరెస్టయ్యాడు. సిట్టింగ్ సీఎంగా ఉండీ అరెస్టైన తొలి ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ రికార్డ్ సృష్టించారు. అయితే, తమ నాయకుడు జైలు నుంచే ముఖ్యమంత్రిగా పాలన నిర్వహిస్తారని ఆప్ నేతలైన అతిషీ, రాఘవ్ చద్దా లాంటి వాళ్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఈడీ, బీజేపీ ప్రభుత్వం కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేయొచ్చు కానీ, ఆయన ఆలోచల్ని కాదని చెప్పారు. ఈ క్రమంలో సీఎం పదవి నుంచి వైదొలిగిన తర్వాత అరెస్టైన మాజీ సిఎంలుగా అరెస్టైన వారి జాబితాను పరిశీలిస్తే.. లాలూ ప్రసాద్ యాదవ్, జయలలిత మొదలు ఓం ప్రకాశ్ చౌతాలా (హరియాణా), మధు కోడా , హేమంత్ సోరెన్‌వంటి నేతలు ఉన్నారు.
లాలూ ప్రసాద్ యాదవ్: 1990-1997 మధ్యకాలంలో బిహార్ ముఖ్యమంత్రిగా లాలూ ప్రసాద్ యాదవ్ పనిచేశారు. దాణా కుంభకోణం కేసులో రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూతోపాటు మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రాలను 2013లో న్యాయస్థానం దోషిగా తేల్చింది. అనంతరం జైలుకు వెళ్లిన ఆయన.. బెయిల్‌పై బయటకు వచ్చారు.
జయలలిత: 1991-2016 మధ్యకాలంలో పలుసార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కలర్ టీవీల కొనుగోళ్ల వ్యవహారంలో అవకతవకలకు సంబంధించిన కేసులో డిసెంబరు 7, 1996లో అరెస్టయ్యారు. అప్పుడు నెల రోజుల పాటు జైలులో ఉన్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 2014లో న్యాయస్థానం ఆమెను దోషిగా తేలుస్తూ తీర్పు వెల్లడిరచడంతో మరోసారి జైలుకు వెళ్లాల్సి వచ్చింది.
ఓంప్రకాశ్ చౌతాలా: 1989-2005 మధ్య హరియాణా ముఖ్యమంత్రిగా పలుసార్లు పనిచేశారు. ఉపాధ్యాయ నియామకాల్లో అవకతవకలకు సంబంధించిన కేసులో 2013లో ఆయన దోషిగా తేలడంతో పదేళ్ల శిక్ష పడిరది. అనంతరం అక్రమాస్తుల కేసులో 2022లో కోర్టు ఆయనకు మరో నాలుగేళ్లు శిక్ష విధించింది.
మధు కోడా: 2006-2008 మధ్య రaారండ్ సీఎంగా పనిచేసిన మధు కోడా.. మైనింగ్ కేసులో 2009లో అరెస్టయ్యారు.
హేమంత్ సోరెన్: 2013-2024 మధ్య కాలంలో రaారండ్ సీఎంగా పనిచేసిన హేమంత్ సోరెన్.. భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో విచారణను ఎదుర్కొంటున్నారు. ఆయన ఈఏడాది జనవరి 31న అరెస్టయ్యారు. అంతకుముందే ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆ స్థానంలో జేఎంఎం సీనియర్ నేత, చంపయీ సోరెన్‌ను కొత్త ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు.తీర్పు వెల్లడిరచడంతో మరోసారి జైలుకు వెళ్లాల్సి వచ్చింది.