CAA : అమల్లోకి CAA చట్టం, కేంద్రం సంచలన నిర్ణయం !

0

సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘పౌరసత్వ సవరణ చట్టం - 2019ను (CAA) నోటిఫై చేసింది. దీంతో నాలుగేళ్ల తర్వాత చట్టం వాస్తవరూపంలోకి వచ్చింది. CAA చట్టం 2019 డిసెంబరులో ఆమోదం పొందింది. దీనికి రాష్ట్రపతి సమ్మతి కూడా లభించింది. కానీ, ఇంతవరకూ దీనిపై నిబంధనలు రూపొందించకపోవడంతో ఈ చట్టం అమల్లోకి రాలేదు.

ఏమిటీ చట్టం...

పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్తాన్‌లకు చెందిన ముస్లిమేతర వలసదారులకు భారత పౌరసత్వం కల్పించడం సీఏఏ ఉద్దేశం. 2014 డిసెంబర్‌ 31కి ముందు భారత్‌కు వలస వచ్చిన వారు ఇందుకు అర్హులు. హిందువులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీలు, క్క్రెస్తవులకు CAA వర్తిస్తుంది. వీరికి ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకపోయినా, వాటి గడువు ముగిసినా పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే. ఈ మేరకు 1955 నాటి పౌరసత్వ చట్టానికి ఎన్డీఏ సర్కారు సవరణలు చేసింది. సీఏఏ బిల్లును తొలుత 2016లో పార్లమెంటులో ప్రవేశపెట్టగా అప్పటి ఎన్డీఏ మిత్రపక్షమైన అసోం గణపరిషత్‌ తదితర పార్టీలు వ్యతిరేకించాయి. అనంతరం 2019లో సీఏఏ బిల్లును పార్లమెంటు ఉభయసభలు ఆమోదించాయి. తర్వాత రాష్ట్రపతి ఆమోదముద్రతో ఇది చట్టంగా మారింది.

గడువులోపు భారత్‌కు వలస వచ్చిన మతపరమైన మైనారిటీలకు ఆరేళ్లలోపు పౌరసత్వం కల్పిస్తారు.

► వాళ్లు భారత్‌లో కనీసం 11 ఏళ్లుగా నివసిస్తూ ఉండాలన్న నిబంధనను కూడా ఐదేళ్లకు తగ్గించారు.

► పౌరసత్వమిచ్చేందుకు ఇలా మతాన్ని ప్రాతిపదికగా తీసుకోనుండటం భారత్‌లో ఇదే తొలిసారి.

► అయితే సీఏఏ పరిధిలో ముస్లిం మైనారిటీలను చేర్చకపోవడం వివాదా స్పదంగా మారింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !