T - SAFE యాప్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్‌

0

ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మంగళవారం టి-సేఫ్‌ యాప్‌ను ప్రారంభించారు. మహిళల ప్రయాణ భద్రత కోసం ఈ యాప్‌ను రూపొందించారు. టీ-సేఫ్‌( T-SAFE) ద్వారా మహిళల భద్రత కోసం ప్రయాణ పర్యవేక్షణ సేవలను పోలీసుశాఖ అందిస్తుంది. కాగా.. అన్ని రకాల మొబైల్‌ఫోన్‌లకు అనుకూలంగా ఉండేలా ఈ యాప్‌ ను తయారు చేశారు. సచివాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.

మహిళల భద్రత కోసం.

టి-సేఫ్‌ యాప్‌..( T-SAFE) ఒంటరిగా ఉన్నప్పుడు, ప్రయాణం చేసినప్పుడు ఏవైనా అనుకోని సంఘటనలు సంభవించితే పోలీసుల నుంచి హెల్ప్‌ కోసం ఉపయోగపడుతుంది. ఈ యాప్‌ లో వారి యొక్క సమస్యను తెలియపరిస్తే.. తాము ఉన్న ప్రదేశానికి సమీపంలో ఉన్న పోలీస్‌ స్టేషన్‌కు ఎస్‌ఓఎస్‌ మెసేజీ వెళ్తుంది. దీంతో.. సహాయం కోరిన వారు ఎక్కడ ఉన్నది పోలీసులకు తెలిసిపోతుంది. ఎస్‌ఓఎస్‌ సందేశాన్ని పంపించిన తొందర్లోనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకునేలా ఈ యాప్‌ను తయారు చేశారు. ఇదిలా ఉంటే.. టి-సేఫ్‌ (T-SAFE) యాప్‌ చాలా సందర్భాల్లో మహిళలకు భద్రత కల్పించింది. దీనిపై పలు కథనాలు సైతం మీడియాలో వచ్చాయి. కాగా.. మహిళలు ఒంటరిగా ప్రయాణించే సందర్భాల్లో తక్షణ సహాయాన్ని అందించడానికి, లైవ్‌ లొకేషన్‌ షేర్‌ చేయడానికి, ప్రయాణమార్గం నావిగేట్‌ చేయడానికి, ఆకస్మిక మార్పులు జరిగినప్పుడు ఈ యాప్‌ ద్వారా.. పోలీసులకు సమాచారం అందుతుంది. అంతేకాకుండా.. పోలీసులు అప్రమత్తం కావడానికి వీలైన అనేక ప్రత్యేక ఫీచర్లను టీ-సేఫ్‌ యాప్‌లో ఉన్నట్లు చెప్పారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !