V Hanumanthrao : ఖమ్మం టికెట్‌ రాకుండా భట్టి అడ్డుపడుతున్నారు: వీహెచ్‌

0

వచ్చే ఎన్నికల్లో తనకు ఖమ్మం లోక్‌సభ టికెట్‌ దక్కకుండా ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అడ్డుపడుతున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి.హనుమంతరావు ఆరోపించారు. ఆయన ఆదివారం ఇక్కడ తెలంగాణ భవన్‌లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘భట్టి ఈరోజు పార్టీలో, ప్రభుత్వంలో ఈ స్థానంలో ఉన్నారంటే అందుకు నేనే కారణం. నేను ఖమ్మం సీటు అడిగితే మొదట ఇస్తానన్నారు. ఇప్పుడు పట్టించుకోవడంలేదు. పార్టీకి చేసిన సేవను దృష్టిలో ఉంచుకొని సోనియా, రాహుల్‌గాంధీలు నాకు న్యాయం చేయాలి. నేను ఖమ్మం టికెట్‌ అడుగుతుంటే.. స్థానికత అడ్డుచూపుతున్నారు. గతంలో అదే ఖమ్మం నుంచి పోటీచేసి గెలిచిన రంగయ్యనాయుడు, నాదెండ్ల భాస్కరరావు, రేణుకాచౌదరిలు స్థానికేతరులు కాదా? పార్టీలో  బీసీలకు అన్యాయం జరుగుతోంది’’ అని వీహెచ్‌ పేర్కొన్నారు.

నేను అడ్డుకోలేదు..భట్టి 

తెలంగాణ కాంగ్రెస్‌లో ఖమ్మం పార్లమెంట్‌ హాట్‌ సీటుగా మారింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌లో అధికారంలోకి ఉండటంతో పాటు కాంగ్రెస్‌ పార్టీకి ఖమ్మం జిల్లా కంచుకోట కావడంతో ఈ సీటుకు భారీగా పోటీ నెలకొంది. డిప్యూటీ సీఎం భట్టి సతీమణి నందిని, మంత్రి పొంగులేటి సోదరుడు, మంత్రి తుమ్మల కొడుకు, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ ఈ టికెట్‌ కోసం పోటీ పడుతున్నారు. అయితే, ఖమ్మం ఎంపీ టికెట్‌ తనకు రాకుండా భట్టి విక్రమార్క అడ్డుకుంటున్నారని షాకింగ్‌ కామెంట్స్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వీహెచ్‌ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. పార్లమెంట్‌ అభ్యర్థుల ఎంపికలో అధిష్టానిదే తుది నిర్ణయమని తేల్చి చెప్పారు. ఏఐసీసీ నిర్ణయం మేరకే అభ్యర్థుల ఎంపిక జరుగుతోందని స్పష్టం చేశారు. ఖమ్మం టికెట్‌ వీహెచ్‌ రాకుండా తాను అడ్డుకుంటున్నాననేది అపోహా మాత్రమేనని.. తాను ఎవరికీ టికెట్‌ రాకుండా అడ్డుకోలేదని ఈ సందర్భంగా భట్టి క్లారిటీ ఇచ్చారు. ఖమ్మం టికెట్‌ సీనియర్‌ నేత వీహెచ్‌కు ఇస్తే అందరం గెల్పించుకుంటామన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !