దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎంఎల్సీ కవిత అరెస్టుపై దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రెస్‌నోట్ విడుదల చేసింది. ఈ కేసులో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 245 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించినట్టు పేర్కొంది. దిల్లీ, హైదరాబాద్ ,చెన్నై, ముంబైతో పాటు పలు ప్రాంతాలో సోదాలు నిర్వహించామని వెల్లడిరచింది. దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటి వరకు 15 మందిని అరెస్ట్ చేశామని, మొత్తం రూ.128.79 కోట్లు సీజ్ చేశామని వెల్లడిరచింది. మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్‌తో పాటు పలువురు అరెస్ట్ అయిన వారిలో ఉన్నారని వివరించింది.
రూ.100 కోట్లను చేర్చడంలో కవితది కీలక పాత్ర
ఈ నెల 23 వరకు కవితకు న్యాయస్థానం రిమాండ్ విధించిందని ఈడీ పేర్కొంది. కవిత ఇంట్లో ఈ నెల 15న సోదాలు నిర్వహించామని, ఆ సమయంలో కవిత బంధువులు ఆటంకం కలిగించాని ప్రకటనలో తెలిపింది. ఆప్ లీడర్లతో కలిసి కవిత అక్రమాలకు పాల్పడినట్లు తేలిందని ఈడీ ప్రకటించింది. రూ.100 కోట్ల మొత్తాన్ని ఆప్ నాయకులకు చేర్చడంలో కవిత కీలక పాత్ర పోషించారని వెల్లడిరచింది. కేజ్రీవాల్, సిసోదియాతో కలిసి కవిత కుట్ర పన్నినట్లు పేర్కొన్నారు. 2021-22 ఏడాదిలో మద్యం కుంభకోణానికి పాల్పడ్డారని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా మద్యం పాలసీని రూపొందించారు. హోల్‌సేల్ డీలర్ల నుంచి వచ్చిన డబ్బును వాటాలుగా పంచుకున్నారు. ఈ సందర్భంగా ఒక నేరాభియోగపత్రం, 5 అనుబంధ పత్రాలు దాఖలు చేసినట్లు ఈడీ అధికారులు వెల్లడిరచారు.