టాలీవుడ్ లో ఇంకో యువ నటుడు పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఇప్పటికే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ లావణ్య వివాహం ఘనంగా జరిగింది. ఇప్పుడు మరో కుర్ర హీరో పెళ్ళికి రెడీ అయ్యాడు. రాజావారు రాణిగారు సినిమాతో హీరోగా పరిచయం అయిన కిరణ్ అబ్బవరం త్వరలో పెళ్లి పీటలెక్కనున్నాడు. రాజావారు రాణిగారు సినిమాలో హీరోయిన్ గా నటించిన రహస్యను కిరణ్ పెళ్లాడనున్నాడు. గత ఐదేళ్లుగా ఈ ఇద్దరూ ప్రేమలో ఉన్నారని తెలుస్తోంది. ఈ నెల 17న ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో వీరి ఎంగేజ్ మెంట్ జరగనుంది. రాజావారు రాణిగారు సినిమా తర్వాత రహస్య పెద్దగా సినిమాల్లో నటించలేదు. ఇక కిరణ్ అబ్బవరం మాత్రం వరుసగా సినిమాలు చేస్తున్నాడు.హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు కిరణ్. తొలి సినిమా రాజావారు రాణి గారు మంచి టాక్ ను సొంతం చేసుకోగా.. ఆతర్వాత వచ్చిన ఎస్ ఆర్ కల్యాణమండపం సినిమా హిట్ అయ్యింది. ఆతర్వాత ఈ యంగ్ హీరో నటించిన సినిమాల్లో కొన్ని యావరేజ్ గా నిలవగా మరికొన్ని నిరాశపరిచాయి. అయినా కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైనప్ చేసి దూసుకుపోతున్నాడు.
రహస్యతో వివాహం
ఇక ఇప్పుడు పెళ్లికి రెడీ అయ్యాడు ఈ యంగ్ హీరో. ఇక రహస్య పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది. రాజావారు రాణిగారు సినిమా తర్వాత తమిళ్ లో ఓ సినిమాలో నటించింది ఈ అమ్మడు. రాజావారు రాణిగారు సినిమాలో తన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. తనదైన శైలిలో, యాసతో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకున్న యువ నటుడు కిరణ్ అబ్బవరం ఇప్పుడు వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. ‘రాజావారు రాణిగారు’ సినిమాతో తెలుగులో నటుడిగా ఆరంగేట్రం చేసిన కిరణ్ ఇప్పుడు అదే సినిమాలో కథానాయికగా చేసిన రహస్యని వివాహం చేసుకోబోతున్నాడు. ఈ విషయాన్నీ అయన ఈరోజు అధికారికంగా ప్రకటించారు. తన పక్కన కథానాయికగా చేసిన సహచర నటిని కిరణ్ అబ్బవరం పెళ్లిచేసుకోబోతున్నారని ఈరోజు ప్రకటించారు. వీరిద్దరూ ఆ సినిమా విడుదలైన దగ్గర నుంచి ప్రేమలో వున్నట్టుగా తెలుస్తోంది. ఈ వారమే ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో వీరి నిశ్చితార్ధం జరగనుంది అని తెలిపారు. తన జీవితాన్ని ఎప్పుడూ ప్రైవేట్ గా ఉంచుకుంటారు కిరణ్ అబ్బవరం. తన వ్యక్తిగత విషయాలు బయటకు ఫోకస్ కానివ్వరు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యుల సమక్షంలో సింపుల్ గా, ప్రైవేట్ గా ఈ నిశ్చితార్ధ కార్యక్రమం జరగనుంది. ఈ నిశ్చితార్థం, పెళ్లికి సంబంధించిన తేదీలు, ఇతర వివరాలు త్వరలో కిరణ్ అబ్బవరం తరపున అతని టీమ్ వెల్లడిరచనుంది. కెరీర్ పరంగా చూస్తే కిరణ్ అబ్బవరం ప్రస్తుతం ‘దిల్ రూబా’ సినిమాతో పాటు 1970వ దశకం నేపథ్యంతో సాగే ఓ పీరియాడిక్ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రాల పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తారు.