ఇటీవలే అధికార వైసీపీని కాదని.. టీడీపీలో చేరిన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లికి శ్రీదేవికి టీడీపీ అధినేత చంద్రబాబు షాకిచ్చారు. ఇవాళ వెల్లడిరచిన జాబితాలో ఆమె పేరు లేకపోవడంతో ట్విట్టర్ వేదికగా తీవ్ర ఆసహనం వ్యక్తం చేశారు. బాపట్ల నియోజకవర్గ మ్యాప్‌ను ట్యాగ్ చేస్తూ కత్తి సింబల్ పెట్టి వెన్నుపోటు పొడిచారంటూ ఉండవల్లి శ్రీదేవి పోస్టు పెట్టారు. ఈ క్రమంలో ఆ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘రాజకీయాలు ఎలా ఉంటాయో.. ఎవరు ఎలాంటి వారో ఈరోజు అర్థం అయ్యింది!!’ అంటూ కత్తి సింబల్‌తో ట్వీట్ చేశారు. కాగా, 2019 ఎన్నికల్లో ఉండవల్లి శ్రీదేవి తాడికొండ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. వృత్తిరీత్య డాక్టర్ అయిన ఆమెకు జగన్ పిలిచి టికెట్ కట్టబెట్టారు. కానీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉండవల్లి శ్రీదేవి క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిరదంటూ ఆమెను జగన్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీంతో బాపట్ల టికెట్ ఆశించి ఆమె వెనువెంటనే టీడీపీలో చేరారు. ప్రస్తుతం ఆ టికెట్ దక్కకపోవడంతో ఉండవల్లి శ్రీదేవి టీడీపీపై ట్విట్టర్ వేదికగా తన అసహనాన్ని బయటపెట్టారు.
రాజకీయాలు ఎలా ఉంటాయో..
— MLA Dr Vundavalli Sridevi (@MlaSrideviDr) March 22, 2024
ఎవరు ఎలాంటి వారో ఈరోజు అర్థం అయ్యింది!! #Bapatla 🗡️ pic.twitter.com/6Mhl0KY7t4