PRAVEEN KUMAR : కాంగ్రెస్‌పై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది.

0

త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌, బీఎస్పీ పార్టీల మధ్య పొత్తు కుదిరింది. రాష్ట్రంలోని 17 నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌తో కలిసి పోటీ చేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ నిర్ణయించారు. పొత్తు అంశంపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడితో కేసీఆర్‌ నిర్ణయించారు.బంజారాహిల్స్‌లోని నంది నగర్‌ నివాసంలో కేసీఆర్‌ను ప్రవీణ్‌ కుమార్‌ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ భేటీ సందర్భంగా పొత్తుపై చర్చించారు. అయితే.. తెలంగాణను కాపాడేందుకే బీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకుంటున్నామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు. మంగళవారం బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌తో కలిసి ఆయన మీడియా ముందు మాట్లాడారు. బీఆర్‌ఎస్‌, బీఎస్పీ చాలా అంశాల్లో కలిసి పని చేసింది. అందుకే లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించాం. కేవలం ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌తోనే ఇప్పడు మాట్లాడాం. రేపు బీఎస్పీ అధినేత్రి మాయవతితో మాట్లాడతా. కచ్చితంగా కలిసి పోటీ చేస్తాం. సీట్ల పంపకాలపై త్వరలోనే  ప్రకటన చేస్తాం అని కేసీఆర్‌ చెప్పారు.  ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. నాలుగు నెలలు కాకముందే కాంగ్రెస్‌ పై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. బీజేపీ, కాంగ్రెస్‌తో రాజ్యాంగానికి ముప్పు ఉంది. రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్ర జరుగుతోంది. ఆ రెండు పార్టీలను కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. మా స్నేహం తెలంగాణను పూర్తిగా మారుస్తుంది అని అన్నారు.

నాగర్‌కర్నూల్‌ నుంచి పోటీ?

ఇక పొత్తు ఖరారు నేపథ్యంలో.. లోక్‌సభ ఎన్నికల్లో నాగర్‌ కర్నూల్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ పోటీ చేయబోతున్నారనే ప్రచారం తెరపైకి వచ్చింది.  నాగర్‌ కర్నూల్‌ సిట్టింగ్‌ ఎంపీ రాములు బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పి.. బీజేపీలో చేరారు. ఇటీవల బీజేపీ ప్రకటించిన లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితాలో రాములు తనయుడు భరత్‌కు నాగర్‌ కర్నూల్‌ సీటు కేటాయించింది కమలం పార్టీ. మరోవైపు కాంగ్రెస్‌ నుంచి ఈ స్థానానికి గట్టి పోటీనే ఉంది. అయితే.. సీనియర్‌ నేత మల్లు రవిని పార్టీ బరిలో నిలిపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ని ఈ స్థానం నుంచి పొత్తులో పోటీ చేయించాలని కేసీఆర్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !