ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో బిగ్ షాక్ తగిలింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనను అరెస్ట్ చేయడం చట్టవిరుద్దం అంటూ కవిత దాఖలు చేసిన పిటీషన్ పై శుక్రవారం సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ నిర్వహించింది. క్రిమినల్ ప్రొసీడిరగ్స్ క్వాష్ చేయాలని కోరుతూ పిటిషన్ లో పేర్కొన్నారు. విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం.. కవితకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. పిటిషన్ లో లేవనెత్తిన ఇతర అంశాలపై విచారణకు అంగీకరించిన ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా.. ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సంజీవ్ ఖన్నా, సుందరేశ్, బేలా ఎం. త్రివేది ధర్మాసనం సూచించింది. ప్రతివాదులకు నోటీసులు ఇచ్చిన ధర్మాసనం.. ఆరు వారాల్లోగా కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది. బెయిల్ గురించి ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సుప్రీంకోర్టు సూచించింది. అయితే,బెయిల్ పిటిషన్‌పై జాప్యం లేకుండా విచారణ జరపాలని ట్రయల్ కోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. ఆరు వారాల్లోగా బదులివ్వాలని కోర్టు ఆదేశించింది. ఢల్లీి లిక్కర్ స్కాం కేసులో ఇటీవల కవితను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఈడీ కస్టడీలో ఉన్నారు. ఈడీ అధికారులు ఆమెను గత ఐదురోజులుగా విచారణ జరుపుతున్నారు. ఇదిలాఉంటే.. కేజ్రీవాల్ అరెస్ట్‌పై సుప్రీంకోర్టు అత్యవసర విచారణకు అంగీకరించింది. కేజ్రీవాల్ అరెస్ట్‌ను సవాల్ చేస్తూ ఆప్ పిటిషన్ దాఖలు చేయగా.. సర్వోన్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. కాగా.. మధ్యాహ్నం రెండున్నరకు కోర్టు ముందు కేజ్రీవాల్ ను ప్రవేశపెట్టనున్నారు. 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోరనున్నట్లు సమాచారం.
అప్రూవర్‌గా మారిన వారి వాగ్మూలం ఆధారంగా...
కవిత తరపున కపిల్ సిబల్, విక్రమ్ చౌదరిలు వాదనలు వినిపించారు. ఈడీ వ్యవహరించిన తీరు, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు తనని తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురి చేస్తున్నాయని కవిత తరపు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఆందోళన వ్యక్తం చేశారు. స్పందించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా ఎమోషన్ కు గురికావద్దని వారించారు. ఈ కేసులో ఒకసారి సాక్షిగా, మరోసారి నిందితురాలిగా విచారించారని, ఒక్క బలమైన సాక్ష్యం కూడా లేదని, అంతా అప్రూవర్ గా మారి ఇచ్చిన వాగ్మూలం ఆధారంగా కేసు దర్యాప్తు సాగుతోందని కపిల్ సిబల్ ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా.. ప్రస్తుతం తాము కేసు మెరిట్స్‌లోకి వెళ్లడం లేదని స్పష్టం చేశారు. పిటిషన్‌లో రాజ్యాంగ పరమైన విషయాలను లేవనెత్తారని, వాటిపై మిగతా పిటిషన్లతో కలిపి విచారిస్తామని పేర్కొన్నారు. కేసు మెరిట్స్ గురించి ట్రయల్ కోర్టుకే చెప్పాలని స్పష్టం చేశారు. బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించే స్వేచ్చ పిటిషనర్‌కు ఉందని, త్వరిత గతిన కేసు విచారణ చేపట్టాలని ట్రయల్ కోర్టుకు ధర్మాసనం సూచించింది. రాజ్యాంగ పరమైన అంశాలపై ఈడీకి త్రిసభ్య ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల్లో సమాధానం చెప్పాలని, తర్వాత మరో రెండు వారాల్లో రిజాయిండర్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఈడీని ఆదేశించింది