తెలంగాణ గవర్నర్‌గా సీపీ రాధకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. 2024 మార్చి 20వ తేదీ ఉదయం11:15 నిమిషాలకు రాజ్ భవన్ లోని దర్బార్ హాల్ లో ప్రమాణస్వీకారోత్సవం జరిగింది. రాజ్‌భవన్‌లో రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే ఆయనతో ప్రమాణం చేయించారు. తమిళిసై రాజీనామా నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము ఆయన్ను నియమించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. సీపీ రాధాకృష్ణన్‌కు తెలంగాణతో పాటుగా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గానూ బాధ్యతలు అప్పగించారు. కాగా 2023 ఫిబ్రవరి నుంచి సీపీ రాధకృష్ణన్ జారండ్ గవర్నర్ గా నియమితులయ్యారు.
నేపథ్యం !
తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్ 1957 మే 4న జన్మించారు. 16 ఏండ్లకే ఆర్‌ఎస్‌ఎస్ లో చేరారు. జన్ సంఫ్‌ు, బీజేపీలో కీలక నేతగా ఎదిగారు. తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి 1998,1999లో బీజేపీ ఎంపీగా గెలిచి... 2004, 2009, 2019లో ఓడిపోయారు. తమిళనాడు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ గా పని చేశారు. 2016 నుంచి 2019 వరకు ఆల్ ఇండియా కాయర్ బోర్డ్ ఛైర్మన్‌గా సేవలందించారు. తమిళనాడు జీజేపీ సీనియర్ నాయకుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. 2023 ఫిబ్రవరి 18 నుంచి రaారండ్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గానూ ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. రెండు చోట్లా పూర్తిస్థాయి గవర్నర్లను నియమించేంత వరకూ సీపీ రాధాకృష్ణన్ బాధ్యతలు నిర్వర్తిస్తారని రాష్ట్రపతి కార్యాలయం మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. కాగా, తెలంగాణకు వరుసగా తమిళనాడుకు చెందిన వ్యక్తులే గవర్నర్లుగా నియమితులవుతున్నారు. తెలంగాణ మొదటి గవర్నర్ గా ఈఎస్‌ఎల్ నరసింహన్ 2014 నుంచి 2019 వరకు పని చేయగా, ఆయన తర్వాత 2019 సెప్టెంబర్ నుంచి 2024 మార్చి వరకు తమిళిసై పని చేశారు.