VH : మళ్ళీ BRS నాయకులకే టికెట్టు ఇస్తే ఎలా రేవంత్‌రెడ్డి !

0

  • బీఆర్‌ఎస్‌ పాలన నచ్చకే కాంగ్రెస్‌ను గెలిపించారు.
  • కాంగ్రెస్‌ని నమ్ముకున్న నాయకులకు అన్యాయం జరుగుతోంది.
  • కార్యకర్తలు బాధపడుతున్నారు గమనించండి. 
  • విహెచ్‌ ఆవేదన !

తెలంగాణ వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసి ఆవేదన వ్యక్తం చేయాలనుకున్నానని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ అన్నారు. అయితే, రేవంత్‌ రెడ్డిని కలిసే అవకాశం రావడం లేదని చెప్పారు. ఇవాళ హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో వీహెచ్‌ మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పీడ పోయిందని రేవంత్‌ రెడ్డి అన్నారని, మరి మళ్లీ ఆ పార్టీ వారిని కాంగ్రెస్‌ పార్టీలో ఎందుకు చేర్చుకుంటున్నారని వీహెచ్‌ నిలదీశారు. ఎన్నో ఏళ్ల నుంచి కష్టపడిన వారెవరూ సీఎం కాలేదని చెప్పారు. రేవంత్‌ రెడ్డి నాలుగేళ్లు కష్టపడి సీఎం అయ్యారని, పార్టీని బలోపేతం చేశారని అన్నారు. బీఆర్‌ఎస్‌ నేతలు కాంగ్రెస్‌లో చేరుతుంటే కార్యకర్తలు బాధపడుతున్నారని వీహెచ్‌ అన్నారు. ఈ విషయాన్ని రేవంత్‌ రెడ్డి గమనించాలని చెప్పారు. బీఆర్‌ఎస్‌ వద్దని ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించారని అన్నారు. ఇన్ని ఏళ్ల నుంచి పార్టీలో కష్టపడుతున్న కాంగ్రెస్‌ నేతలకు న్యాయం చేయకుండా ఇతరులకు టికెట్లు ఇవ్వడం ఏంటని నిలదీశారు. కాంగ్రెస్‌ నేతలపై కేసులు పెట్టిన వాళ్లకు టికెట్లు ఇస్తున్నారని వీహెచ్‌ మండిపడ్డారు. బయట డబ్బులు సంపాదించినవారు కాంగ్రెస్‌ పార్టీలోకి వస్తున్నారంటే ఎందుకో అర్థం చేసుకోవాలని అన్నారు.

కార్యకర్తలకు అన్యాయం జరగొద్దు

రేవంత్‌ రెడ్డి ఒక్క సైడ్‌ మాత్రమే వినొద్దని.. రెండు సైడ్స్‌ వినాలని వీహెచ్‌ కోరారు. పార్టీ కార్యకర్తలకు అన్యాయం చేయొద్దని వినతి చేశారు. ‘‘నేను రేవంత్‌ రెడ్డికి వ్యతిరేకం కాదు.. ఎవ్వరికి అన్యాయం జరగొద్దనేది నా ఆవేదన.. రేవంత్‌ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రివి.. నిన్ను కలవాలంటే నీ దగ్గరకు వాళ్ళు రావాలి.. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్లి ఆహ్వానించడం కరెక్ట్‌ కాదు.. నీ స్థాయి నువ్వే తగ్గించుకుంటున్నావు’’ అంటూ వీహెచ్‌ వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి చూస్తే.. రేవంత్‌కు సలహాలు, సూచనలు ఇస్తూనే.. కాస్త అసంతృప్తి అంతకుమించి ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు వీహెచ్‌. దీనిపై హైకమాండ్‌.. మరీ ముఖ్యంగా రేవంత్‌ ఎలా రియాక్టవుతారో చూడాలి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !