టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘ఫ్యామిలి స్టార్’. మృణాళ్ ఠాకూర్ హీరోయిన్‌గా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఏప్రిల్ 5న థియేటర్లలో సందడి చేయనుంది. గీతా గోవిందం సూపర్ హిట్ తర్వాత విజయ్, పరుశురామ్ కాంబోలో వస్తున్న ఈ మూవీ పై ఆసక్తి నెలకొంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. ఇక ఇది వరకు రిలీజ్ సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. మ్యూజిక్ లవర్స్‌కు తెగ నచ్చేశాయి. ఇక తాజాగా ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ గమనిస్తే... కంప్లీట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. మధ్య తరగతికి చెందిన హీరో.. తన ఫ్యామిలీ ఎమోషన్స్ ను.. బాధ్యతలను.. ప్రేమను ఎలా హ్యాండిల్ చేస్తాడు.. తన కెరీర్ లో ఎలా ముందుకు వెళ్తున్నాడు అనే అంశాలను ఈ మూవీలో చూపించనున్నారని తెలుస్తోంది. స్వామి నా జీవితంలో కొత్తగా బ్రేక్‌లు ఇవ్వకున్నా పర్వాలేదు..కానీ ఉన్నదాన్ని మాత్రం చెడగొట్టకు.. అంటూ విజయ్ దేవరకొండ డైలాగ్స్‌తో మొదలైన ట్రైలర్.. కుటుంబం చుట్టూ తిరిగే ఫన్ అండ్ సీరియస్ ఎలిమెంట్స్‌తో సినిమా వినోదాత్మకంగా సాగనున్నట్టు తెలుస్తోంది. పరశురాం మరోసారి తన మార్క్‌ను సినిమాలో పర్‌ఫెక్ట్‌గా చూపించబోతున్నట్టు స్పష్టంగా కనబడుతుంది. మృణాల్ యాక్టింగ్ కూడా ఎంతో ఆకట్టుకునే సిద్ధంగా ఉంది. మొత్తానికి విజయ్ మంచి హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
యాక్షన్ పార్టు కొంచం ఎక్కువగా
అయితే గీతాగోవిందం సినిమా కంటే.. ఈ మూవీలో యాక్షన్ పార్ట్ ఉండనున్నట్లు తెలుస్తోంది. మృణాల్ కాకుండా ఈ సినిమాలో అమెరికన్ నటి మరిస్సా రోజ్ గార్డన్, మజిలీ మూవీ ఫేమ్ దివ్యాంశ కౌశిక్, రష్మిక మందన్నా కనిపించనున్నారని టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రానికి గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు. ఖుషి సినిమా తర్వాత విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమా ఇది. లైగర్ సినిమా తర్వాత విజయ్ పూర్తిగా లవ్ స్టోరీస్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ స్టోరీస్ పై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఖుషి సినిమాలో విజయ్ దేవరకొండ జోడిగా సమంత నటించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్ షూరు చేసింది చిత్రబృందం. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమాను ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్.. తన లైఫ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. పాఠశాల రోజుల్లో సైకిల్ కావాలని నాన్నను అడిగితే బర్త్ డేకు కొంటానని.. సెలవుల్లో కొంటానని చెప్పేవారని.. కానీ ఎప్పటికో ఆ కోరిక నెరవేర్చారని అన్నారు. సైకిలే కాకుండా టీవీ, వీడియో గేమ్,.. కంప్యూటర్.. ఇలా చిన్నతనంలో అందరికీ వాటిపై ఆసక్తి ఉంటుందని.. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా సర్దుకుపోవాల్సి వస్తుందని.. అడ్జస్ట్మెంట్ అనేది జీవితంలో ఓ పాఠం అని అన్నారు. ఇప్పటికీ తాను ఏదోక విషయంలో సర్దుకుపోతుంటా అని అన్నారు.