Family Star VD : ప్రేమించే పెళ్ళి చేసుకుంటా !

0

ఫ్యామిలీ స్టార్‌’తో ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు సిద్ధమయ్యారు నటుడు విజయ్‌ దేవరకొండ. వేసవి కానుకగా ఏప్రిల్‌ 5న ఇది విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తమిళనాడులో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో విజయ్‌ దేవరకొండ పాల్గొన్నారు. తన సినిమా విశేషాలు, పెళ్లి ముచ్చట్లు పంచుకున్నారు. ‘‘నాక్కూడా పెళ్లి చేసుకోవాలని, తండ్రి కావాలని ఉంది. కాకపోతే ఇప్పుడే చేసుకోను. ప్రేమ వివాహమే చేసుకుంటా. నా తల్లిదండ్రులకు ఆ అమ్మాయి తప్పక నచ్చాలి’’ ‘‘కొంతమంది తమిళ దర్శకులు నాకు కథలు చెప్పారు. అందులో కొన్ని త్వరలోనే కార్యరూపం దాల్చనున్నాయి. గౌతమ్‌ తిన్ననూరితో నేను చేయబోయే చిత్రంలో చాలామంది కోలీవుడ్‌ నటీనటులు భాగం కానున్నారు’’ అని విజయ్‌ అన్నారు.‘యూనివర్సల్‌ కంటెంట్‌తో ‘ఫ్యామిలీస్టార్‌’ రూపుదిద్దుకుంది. ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది. ఏప్రిల్‌ 5న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నాం. రెండు వారాల తర్వాత హిందీ, మలయాళంలో రిలీజ్‌ చేయనున్నాం. తమిళనాడులో 250 థియేటర్స్‌లో ఇది విడుదలవుతోంది. ఇటీవల సెన్సార్‌ పూర్తైంది. దీని రన్‌టైమ్‌ 2.40 గంటలు. నాలుగు ఫైట్స్‌ ఉన్నాయి. ఆ కారణంతోనే యూ/ఏ సర్టిఫికేట్‌ ఇచ్చారు’’ అని ఇదే ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న చిత్ర నిర్మాత దిల్‌రాజు అన్నారు ‘గీత గోవిందం’ తర్వాత పరశురామ్‌ - విజయ్‌ దేవరకొండ కాంబోలో వస్తోన్న చిత్రమిది. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినీ ప్రియుల్లో ఆసక్తిని పెంచాయి. 

నాకు పార్టీ కావాలి అంటూ రష్మిక పోస్ట్‌  !

‘ఫ్యామిలీ స్టార్‌’ విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో తాజాగా ఈ ట్రైలర్‌పై రష్మిక ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టింది. ‘ఫ్యామిలీ స్టార్‌’ చాలా బాగుంది. నాకు చాలా ఇష్టమైన విజయ్‌ దేవరకొండ, పరశురామ్‌.. ‘ఫ్యామిలీ స్టార్‌’ సినిమాతో విజయం సాధించాలని కోరుకుంటున్నా. ఏప్రిల్‌ 5 కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా. మీరు తప్పకుండా హిట్‌ కొడతారు. హిట్‌ కొట్టిన తర్వాత నాకు పార్టీ కావాలి’’. అంటూ రష్మిక పోస్ట్‌ పెట్టింది. కాగా దీనిపై విజయ్‌ రిప్లయ్‌ ఇస్తూ క్యూటెస్ట్‌ అంటూ పెట్టాడు. కాగా ప్రస్తుతం ఈ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !