Delhi liquor scam : దిల్లీ లిక్కర్‌ స్కామ్‌ ఏంటి ? కవిత పాత్ర ఏంటి ?

0

గత రెండేళ్లుగా దిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసు చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. గల్లీ నుంచి దిల్లీ వరకూ ఎక్కడ చూసినా.. ఎక్కడ విన్నా ఇదే పేరు వినిపిస్తోంది. ఇందులో పెద్ద తలకాయలు ఉండటంతో మరింత హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ కేసులో సీబీఐ, ఈడీ దూకుడుగా ముందుకెళ్తున్నాయి. దిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో తెలంగాణ మాజీ సీఎం కూతురు,ఎమ్మెల్సీ కవితను శుక్రవారం ఈడీ అధికారులు అరెస్ట్‌ చేశారు. హైదరాబాద్‌ లోని కవిత నివాసంలోనే ఆమెను అదుపులోకి తీసుకొన్న ఈడీ అధికారులు  విమానంలో ఆమెనుదిల్లీకి తరలించారు. ఇవాళ దిల్లీలోని రౌజ్‌ రెవెన్యూ కోర్టులో కవితను ప్రవేశపెట్టనుంది ఈడీ.

అసలు దిల్లీ లిక్కర్‌ స్కాం ఏంటి

దేశ రాజధాని దిల్లీలో గతంలో  60 శాతం మద్యం దుకాణాలు ప్రభుత్వ, 40 శాతం ప్రైవేటు ఆధ్వర్యంలో ఉండేవి. అయితే వాటిని 100శాతం ప్రైవేటుకు అప్పగించాలని 2020లో ఆప్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆప్‌ సర్కార్‌ నిర్ణయం మేరకు 2021 జనవరి 5న లిక్కర్‌ పాలసీ రూపకల్పనకు దిల్లీ ప్రభుత్వం మంత్రుల బృందంతో కూడిన ఓ కమిటీ వేసింది. డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా, సత్యేంద్ర జైన్‌, కైలాశ్‌ గెహ్లాట్‌ ఈ బృందంలో ఉన్నారు. వాళ్లంతా కలిసి రెండు నెలల తర్వాత కొత్త లిక్కర్‌ పాలసీని అందించారు. ఈ కొత్త లిక్కర్‌ పాలసీని ఆప్‌ సర్కార్‌..మే 21, 2021న ఎలాంటి సవరణలు లేకుండానే ఆమోదించింది. ప్రభుత్వానికి భారీగా ఆదాయం తగ్గి, షాపుల నిర్వాహకులకు అతి భారీ లాభం వచ్చేలా పాలసీ రూపొందింది. దాదాపు నాలుగు నెలలు పెండిరగ్‌ పెట్టిన తర్వాత 2021 నవంబర్‌లో కేజ్రీవాల్‌ సర్కార్‌ తీసుకొచ్చిన కొత్త లిక్కర్‌ పాలసీకి దిల్లీ లెఫ్టనెంట్‌ గవర్నర్‌ ఓకే చెప్పారు. దీంతో 2021లో కేజ్రీవాల్‌ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని అమల్లోకి తీసుకొచ్చింది. మద్యం అమ్మకాలకు ప్రభుత్వం టెండర్లు పిలిచి ప్రైవేటు వ్యక్తులకు షాపులను అప్పగించింది. దీనికి గాను వారి నుంచి లైసెన్స్‌ ఫీజు వసూలు చేసింది. కొత్త ఎక్సైజ్‌ పాలసీకి అనుగుణంగా దిల్లీలో 849 మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. ఈ పాలసీ అమలు సమయంలో లైసెన్స్‌ ఫీజులను కూడా ప్రభుత్వం భారీగా పెంచింది. కొత్త మద్యం పాలసీ అమల్లోకి వచ్చిన తర్వాత ఎల్‌-1 లైసెన్స్‌ కోసం కాంట్రాక్టర్లు రూ.5 కోట్లు చెల్లించాల్సి ఉండగా, గతంలో రూ.25 లక్షలు కాంట్రాక్టర్లు చెల్లించాల్సి వచ్చేది. అదేవిధంగా ఇతర కేటగిరీల్లో లైసెన్స్‌ ఫీజులు కూడా గణనీయంగా పెంచింది ఆప్‌ సర్కార్‌. దీంతో బడా మద్యం కంట్రాక్టర్లకు మాత్రమే మార్కెట్లో లైసెన్సులు లభించాయి. దిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పాలసీ ప్రకారం.. మద్యం హోం డెలివరీ, మద్యం షాపులు తెల్లవారుజామున 3 గంటల వరకు తెరుచుకునే వెసులు బాటు ఉంది. మధ్యం ధరల విషయంలో ప్రైవేటు వ్యాపారులు స్వేచ్ఛగా వ్యవహరించే అవకాశం ఉంది. అంటే ధరలను వారి ఇష్ట ప్రకారం పెంచుకోవచ్చన్నమాట. లైసెన్సుల జారీ విషయంలోనూ అపరిమిత డిస్కౌంట్లను కేజ్రీవాల్‌ ప్రభుత్వం ఆఫర్‌ చేసింది. ఈ వెసులుబాట్ల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని 27 శాతం పెంచుతున్నామని, అదనంగా రూ.8,900 కోట్లు ప్రభుత్వ ఖజానాలోకి చేరుతాయని కేజ్రీవాల్‌ ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది. అయితే 2022 ఏప్రిల్‌లో దిలీ చీఫ్‌ సెక్రెటరీగా నరేష్‌ కుమార్‌ నియమితులయ్యారు. ఉద్యోగంలో చేరగానే కొత్త లిక్కర్‌ పాలసీని క్షుణ్ణంగా స్టడీ చేసిన నరేష్‌ కుమార్‌..లిక్కర్‌ పాలసీ రూపకల్పనలోనే అవకతవకలు జరిగాయని..మద్యం దుకాణాల కేటాయింపులోనూ తప్పులు జరిగినట్లు గుర్తించి దీనిపై ఓ రిపోర్ట్‌ ని రెడీ చేసి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కు అందించారు. దీంతో ఈ విషయంపై కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌ భల్లాకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ లేఖ రాశారు. జులై 22, 2022న ఆ లేఖ పరిగణనలోనికి తీసుకుని సీబీఐ దర్యాప్తునకు కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఓ వైపు చీఫ్‌ సెక్రెటరీ నివేదిక రూపొందిస్తున్న సమయంలోనే కొత్త లిక్కర్‌ పాలసీని రద్దుచేస్తున్నట్లు కేజ్రీవాల్‌ ప్రభుత్వం ప్రకటించింది. తాము ఆశించిన స్థాయిలో ప్రభుత్వ ఆదాయం పెరగడం లేదని అందుకే కొత్త పాలసీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది ఆప్‌ ప్రభుత్వం.

ఆ తర్వాత ఏం జరిగింది

లైసెన్సుల జారీలో లంచాలు తీసుకుని పర్మిషన్‌లు ఇచ్చారని,మద్యం పాలసీలో మార్పులు చేస్తూ దిల్లీ ఉపముఖ్యమంత్రి సిసోడియా ప్రభుత్వానికి 145కోట్ల రూపాయల నష్టం చేశారని,ప్రతీ బీర్‌ కేస్‌కు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఇంపోర్ట్‌ డ్యూటీని ప్రభుత్వం మాపీ చేసింది. మద్యం వ్యాపారులు లైసెన్స్‌ ఫీజు రూపంలో ప్రభుత్వానికి కట్టాల్సిన రూ.145 కోట్ల రూపాయలను కోవిడ్‌ పేరుతో ఏకపక్షంగా ప్రభుత్వం మాఫీ చేసిందని ఆరోపణలు ఉన్నాయి. కొందరు ప్రైవేట్‌ వ్యక్తులకు లాభం చేకూర్చేలా ఈ కొత్త లిక్కర్‌ పాలసీని తీసుకొచ్చారని..సౌత్‌ గ్రూప్‌ అనే పేరుతో దక్షిణాదికి చెందిన కొందరు ఓ సిండికేట్‌ గా ఏర్పడి ఈ పాలసీ ద్వారా లబ్ది పొందారని..ఈ క్రమంలో ఆప్‌ ప్రభుత్వానికి లంచాలు ముట్టాయని అనేక ఆరోపణలు ఉన్నాయి. కొత్త మద్యం పాలసీలో నిబంధనల ఉల్లంఘన, విధానపరమైన అవకతవకలకు సంబంధించి 15 మంది నిందితులపై 2022 ఆగస్టులో సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఆ తర్వాత సీబీఐ నమోదు చేసిన కేసుకు సంబంధించి పీఎంఎల్‌ఏ కింద మనీలాండరింగ్‌ కేసును ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. దిల్లీ ప్రభుత్వ నూతన మద్యం పాలసీలో జరిగిన కుంభకోణంపై ఈడీ, సీబీఐ వేర్వేరుగా దర్యాప్తు చేస్తున్నాయి. ఈ విధానం రూపకల్పన, అమలులో మనీలాండరింగ్‌ జరిగిందన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. విధాన రూపకల్పనలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది.

‘సౌత్‌ గ్రూప్‌’’  లిక్కర్‌ స్కామ్‌

హైదరాబాద్‌ కు చెందిన ప్రముఖ లిక్కర్‌ వ్యాపారవేత్త,రాబిన్‌ డిస్టిలరీస్‌ పేరుతో వ్యాపారం చేసిన అరుణ్‌ రాంచంద్ర పిళ్లై, వైసీపీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన కుమారుడు రాఘవ మాగుంట, అరబిందో ఫార్మాకు వ్యవస్థాపకుడు శరత్‌ చంద్రారెడ్డిలతో కూడిన ‘‘సౌత్‌ గ్రూప్‌’’ ఈ లిక్కర్‌ స్కామ్‌లో అవినీతికి పాల్పడిరదన్న ఆరోపణలు ఉన్నాయి. సిబిఐ ప్రకారం.. ఎక్సైజ్‌ శాఖ అధికారులతో పాటు దిల్లీ ఎక్సైజ్‌ పాలసీ 2021-22ని రూపొందించడంలో,అమలు చేయడంలో క్రియాశీల పాత్ర పోషించిన నిందితులలో పిళ్లై ఒకరు. ఈడీ ప్రకారం.. ఈ అరుణ్‌ రామచంద్ర పిళ్లై మద్యం తయారీ కంపెనీ ఇండోస్పిరిట్స్‌ సంస్థకు అన్నీ తానై వ్యవహరించేవాడు. ఈ కంపెనీలో 32.5 శాతం షేర్‌ పిళ్లైదే . హైదరాబాద్‌కు చెందిన ఈ వ్యాపారవేత్త మనీ లాండరింగ్‌కు పాల్పడి ప్రజాప్రతినిధులకు ఢల్లీిలో లిక్కర్‌ లైసెన్సుల విషయంలో అక్రమ మార్గంలో మేలు చేశాడనేది పిళ్లైపై ఉన్న ప్రధాన అభియోగం. సీబీఐ సమాచారం ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన రాబిన్‌ డిస్టిలరిస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు పిళ్లై డైరెక్టర్‌గా ఉన్నారు. ఏప్రిల్‌ 22, 2022న స్థాపించిన ఈ కంపెనీకి ప్రేంసాగర్‌ గండ్రా మరో డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఢల్లీిలో ఉన్న, సమీర్‌ మహేంద్రుకు చెందిన ఇండో స్పిరిట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో రాబిన్‌ డిస్టిలరిస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి సంబంధాలున్నాయి. ఢల్లీిలో ఉన్న ూఅశ్రీవ ుశీబషష్ట్ర ూశీబసవతీ అనే ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీకి ఈ మహేంద్రు, దిల్ల్లీ లిక్కర్‌ స్కాంలో కీలకంగా వ్యవహరించిన విజయ్‌ నాయర్‌ ఓనర్లు. మహేంద్రుకు, విజయ్‌ నాయర్‌కు మధ్య మధ్యవర్తిగా పిళ్లై వ్యవహరించినట్లు సీబీఐ చెబుతోంది. విజయ్‌ నాయర్‌కు పిళ్లై కోట్ల రూపాయల ముడుపులు చెల్లించేవాడని.. ఆ తర్వాత ఆ డబ్బును దిల్లీ ప్రభుత్వ ఉద్యోగులకు లంచాల రూపంలో విజయ్‌ నాయర్‌ చేరవేసేవారని సీబీఐ పేర్కొంది. పిళ్లై ముడుపులు చెల్లించే సొమ్ము ఎక్కడ నుంచో వచ్చేది కాదట. మహేంద్రుకు చెందిన ఇండో స్పిరిట్స్‌ సంస్థ ద్వారా వచ్చిన డబ్బును విజయ్‌ నాయర్‌కు రామచంద్ర పిళ్లై పంపేవాడని సీబీఐ స్పష్టం చేసింది.

ఈడీ చెబుతున్న వివరాల ప్రకారం.. ఇండోస్పిరిట్స్‌ కంపెనీ అక్రమంగా ఆర్జించిన రూ.69 కోట్ల డబ్బులో, రూ.29 కోట్లు పిళ్లై అకౌంట్స్‌కు ట్రాన్స్‌ఫర్‌ అయ్యాయి. ఈ డబ్బులో పిళ్లై ఒక టీవీ ఛానల్‌ అధినేతకు రూ.4.75 కోట్లు, రూ.3.85 కోట్లను అభిషేక్‌ బోయినపల్లి అకౌంట్‌కు పేమెంట్‌ చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ గుర్తించింది. అభిషేక్‌ బోయినపల్లి కూడా ఢల్లీి లిక్కర్‌ స్కాం కేసులో నిందితుడే కావడం గమనార్హం. ఇక్కడ మరో ట్విస్ట్‌ ఏంటంటే.. అరుణ్‌ రామచంద్ర పిళ్లైకు చెందిన రాబిన్‌ డిస్టిలరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అండ్‌ రాబిన్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఎల్‌ఎల్‌పి అడ్రస్‌.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత బంధువులకు చెందిన బ్యూటీపార్లర్‌ ఒకటే అడ్రస్‌తో ఉండటం కొసమెరుపు. తాను బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత ప్రతినిధినని,ఆమె తరపున సౌత్‌ గ్రూప్‌ కి ప్రాతినిధ్యం వహించానని అరుణ్‌ రామచంద్ర పిళ్ళై ఈడీ విచారణలో అంగీకరించినట్లు సమాచారం. కవిత బినామీనే రామచంద్ర పిళ్లై అని ఈడీ బలంగా వాదిస్తోంది.

కవిత ప్రమేయం ఏంటి

దిల్లీ బీజేపీ ఎంపీ పర్వేశ్‌ వర్మ, దిల్లీకి చెందిన మాజీ ఎమ్మెల్యే మంజీందర్‌ సిర్సా దిల్లీ లిక్కర్‌ స్కామ్‌ లో కవిత పాత్ర ఉందని తీవ్ర ఆరోపణలు చేశారు. కేసిఆర్‌ కుటుంబ సభ్యుల సూచనలతోనే దిల్లీ మద్యం విధానాన్ని రూపొందించారని, మద్యం విధానానికి సంబంధించిన చర్చల్లో స్వయంగా కవిత పాల్గొన్నారని, ఢల్లీి ఉపముఖ్యమంత్రి సిసోడియా, ఎక్సైజ్‌ అధికారులు, కెసిఆర్‌ కుటుంబ సభ్యులు సదరు హోటల్లో జరిగిన చర్చల్లో డీల్‌ కుదుర్చుకున్నారని వారు ఆరోపించారు. అరుణ్‌ రామచంద్ర పిళ్లై..దిల్లీలోని ఒబెరాయ్‌ హోటల్లో ఆరునెలలపాటు కవిత కోసం ఒక గదిని బుక్‌ చేసి ఉంచారని తెలిపారు. రామచంద్రన్‌ పిళ్ళైని దిల్లీలో వ్యాపారం చేయడానికి కవిత తీసుకువచ్చారని కూడా పేర్కొన్నారు. లిక్కర్‌ మాఫియా కమిషన్‌ ను పది శాతం పెంచేందుకు చేసుకున్న 150 కోట్ల రూపాయల డీల్‌ లో మొదటి విడత మొత్తం కవిత ద్వారా దిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా కు ముట్టిందని వారు ఆరోపించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !