AstraZeneca : కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌తో సైడ్‌ ఎఫెక్ట్స్‌ నిజమే ! అంగీకరించిన ఆస్ట్రాజెనెకా !!

0

  • ఆక్స్‌ఫర్డ్‌తో కలిసి టీకాను అభివృద్ధి చేసిన ఆస్ట్రాజెనెకా
  • భారత్‌లో కోవిషీల్డ్‌ను ఉత్పత్తి చేసిన సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌
  • రక్తం గడ్డకట్డడం, ప్లేట్‌లెట్‌ కౌంట్‌ తగ్గడానికి వ్యాక్సిన్‌ కారణం

కరోనా టీకా వేయించుకున్న తర్వాత చిన్న చిన్న దుష్ప్రభావాలు కనిపించడం సర్వసాధారణమే. టీకా పని చేస్తోందనడానికి అవి ఒక సంకేతం కూడా కావచ్చని నిపుణులు అప్పట్లో చెప్పారు. కానీ, టీకాను తయారుచేసిన సంస్థ మాత్రం.. ఎటువంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేవని చెప్పింది. కానీ, చివరకు వాస్తవం మాత్రం అంగీకరించక తప్పలేదు. అయితే, ఒక టీకా వేయాలంటే అన్ని రకాల ట్రయల్స్‌ పూర్తి చేసి సురక్షితమైనదని నిర్ధారించిన తర్వాతే వేయాల్సి ఉంటుందని, కరోనా టీకాను పూర్తి స్థాయిలో నిర్ధారించుకోకముందే కోట్లాది మందికి వేశారనే ఆరోపణలు ఉన్నాయి. కరోనా వైరస్‌ కోసం తయారు చేసిన టీకా కోవిషీల్డ్‌తో అరుదైన దుష్ప్రభావాలు తలెత్తుతాయని బ్రిటిష్‌ సంస్థ ఆస్ట్రాజెనెకా ఎట్టకేలకు అంగీకరించింది. కోవిషీల్డ్‌ అరుదైన సందర్భాల్లో రక్తం గడ్డకట్టడం, ప్లేట్‌లెట్‌ కౌంట్‌ తగ్గిపోవడం వంటి పరిస్థితికి కారణమవుతుందని కోర్టుకు సమర్పించిన అఫిడ్‌విట్‌లో ఆస్ట్రాజెన్‌కా పేర్కొన్నట్టు బ్రిటన్‌ పత్రిక టెలిగ్రాఫ్‌ నివేదించింది. కోవిడ్‌-19 మహమ్మారి సమయంలో ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్‌ను పుణేలోని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఉత్పత్తి చేసింది. ఈ టీకాను దేశంలో విస్తృతంగా వినియోగించిన విషయం తెలిసిందే. అనంతరం కాలక్రమంలో ఆస్ట్రాజెనెకా టీకాపై బ్రిటన్‌ కోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. 

అరుదైన సందర్భాల్లో టిటిఎస్‌ జరుగుతుంది.

ఈ టీకా ప్రభావం కారణంగా అనేక సందర్భాల్లో మరణాలు, తీవ్ర దుష్ప్రభావాలకు కారణమైందని ఆరోపిస్తూ హైకోర్టులో దాదాపు 51 కేసులు విచారణలో ఉండగా.. బాధితులు 100 మిలియన్‌ పౌండ్ల వరకు నష్టపరిహారాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. కోవిషీల్డ్‌పై జామీ స్కాట్‌ అనే వ్యక్తి మొదటి కేసును వేశాడు. ఏప్రిల్‌ 2021లో తనకు వ్యాక్సిన్‌ అందిందని, దీని వల్ల రక్తం గడ్డకట్టి మెదడుకు శాశ్వతంగా గాయమైందని అతడు ఆరోపించారు. టీకా వల్ల తాను లేవలేని పరిస్థితికి చేరుకున్నానని, తాను చనిపోతానని వైద్యులు తన భార్యకు మూడుసార్లు చెప్పారని పేర్కొన్నాడు.అయితే, ఈ ఆరోపణలను ఆస్ట్రాజెనెకా తోసిపుచ్చింది. కానీ, ఈ ఏడాది ఫిబ్రవరిలో కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్‌లలో ఒకదానిలో ‘కోవిషీల్డ్‌ చాలా అరుదైన సందర్భాల్లో ుుూకి కారణమవుతుంది’ అని అంగీకరించినట్లు నివేదిక తెలిపింది. ుుూ (థ్రాంబోసిస్‌ విత్‌ థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్‌) రక్తం గడ్డకట్టడం, మానవ రక్తంలో ప్లేట్‌లెట్‌ కౌంట్‌ తగ్గిపోవడానికి కారణమవుతుంది.

టీకాలు తీసుకున్న వారీలో అనారోగ్య సమస్యలు

‘ఆస్ట్రాజెనెకా టీకా చాలా అరుదైన సందర్భాలలో ుుూకి కారణమవుతుందని అంగీకరిస్తున్నాం.. దీనికి గల కారణం తెలియదు... టీకా తీసుకోని వారిలోనూ ుుూ సంభవించవచ్చు.. ఈ కేసుల్లో వైద్య నిపుణుల ఆధారం కోసం ఒక అంశం ఉంటుంది’ అని ఆస్ట్రాజెనెకా పేర్కొన్నట్టు టెలిగ్రాఫ్‌ తెలిపింది. స్కాట్‌ ఆరోపణల విషయంలో చట్టపరంగా రక్షణ కోసం లోపాన్ని అంగీకరించడంతో బాధితులకు పరిహారం చెల్లించే అవకాశం ఉంది. ప్రస్తుతం టీకా దుష్ప్రభావంపై కంపెనీ ప్రకటన.. 2023 స్టాండ్‌కు విరుద్ధంగా ఉంది. ‘టిటిఎస్‌ సాధారణ స్థాయిలో టీకా వల్ల సంభవిస్తుందని మేం అంగీకరించం’ మని వాదించింది. టీకా లోపభూయిష్టంగా ఉందని, దాని సమర్థత చాలా ఎక్కువచేసి చూపారన్న జామీ స్కాట్‌ న్యాయవాదుల వాదనలను ఆస్ట్రాజెనెకా ఖండిరచింది. ఇక, కరోనా టీకాలు తీసుకున్నవారిలో గుండెపోటు వంటి పలు అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నట్టు అనేక అధ్యయనాల్లోనూ వెల్లడైన విషయం తెలిసిందే.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !