CV Anand : విద్యార్థుల్ని గొర్రెలుగా మార్చుతున్న చైతన్య, నారాయణ విద్య !

0

2023-2024 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్‌ ఫలితాలను బుధవారం విద్యాశాఖ కార్యదర్శి విడుదల చేశారు. ఈ ఫలితాల్లో ఫస్టియర్‌ లో 60.01 శాతం, సెకండియర్‌ లో 64.19 శాతం మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. దీంతో పరిక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులు (Inter Failed Students Suisides) మనస్థాపంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కాగా నిన్న సాయంత్రం వరకు మొత్తం ఏడుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. సంగారెడ్డి జిల్లా కొల్లూర్‌కు చెందిన సాయితేజ(17), అత్తాపూర్‌కు చెందిన హరిణి, అచ్చులాపూర్‌ గ్రామానికి చెందిన మైదం సాత్విక్‌, దొరగారి పల్లెకు చెందిన గట్టిక తేజస్విని, ముదిగొండకు చెందిన వాగదాని వైశాలి, చిలుకోడు గ్రామానికి చెందిన చిప్పా భార్గవి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. దీంతో ఆయా విద్యార్థుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. తాగా రంగారెడ్డిలో ఓ బాలిక కూడా ఫెయిల్‌ అయ్యాననే మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడిరది. దీంతో ఇప్పటి వరకు ఫలితాల కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య 8 కి చేరగా.. ఇందులో అత్యధికంగా ఏడుగురు బాలికలే ఉన్నారు. ఇదిలా ఉంటే ఇంటర్‌లో ఫెయిల్‌ అయినంత మాత్రాన ఆత్మహత్య చేసుకోవాలని వీరికి ఎవరు సూచిస్తున్నారని.. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందని ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి చెందుతున్నారు.

సీవీ ఆనంద్‌ ఎమోషనల్‌ ట్వీట్‌ !

తెలంగాణలో ఇంటర్‌ ఫలితాల అనంతరం విద్యార్ధులు ఆత్మహత్య చేసుకొని చనిపోవడంపై ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌, ఐపీఎస్‌ సీవీ ఆనంద్‌ ఎమోషనల్‌ ట్వీట్‌ చేశారు. ఫలితాల కారణంగా 7 మంది ఇంటర్మీడియట్‌ విద్యార్ధుల చనిపోవడానికి కొన్ని కారణాలను చెబుతూ.. విద్యార్ధులు ఒత్తిడి గురి కాకుండా ఉండేందుకు 2001 నీరద రెడ్డి కమిటీ సిఫార్సులను ఎవరు ఆపుతున్నారంటూ ఓ నెటిజన్‌ చేసిన ట్వీట్‌ కు స్పందించిన ఆయన ఇది చదివితే నా గుండె తరుక్కుపోతుందని అన్నారు. ప్రతిష్టాత్మకమైన తల్లిదండ్రులు, విద్యా వ్యవస్థ యొక్క ఒత్తిడిలో 7 విలువైన జీవితాలు బలి అయ్యాయని ఆవేధన వ్యక్తం చేశారు. దశాబ్దాల క్రితమే చైతన్య- నారాయణ (Sri Chaitanya, Narayana) ప్రవేశపెట్టిన శాపగ్రస్తమైన కార్పొరేట్‌ చదువు పిల్లలను గొర్రెలుగా మార్చడం ప్రారంభించిందని, ఈ పరీక్షలే జీవితానికి ముగింపు అని భావించవద్దని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. జీవితం చాలా పెద్దదని, ఈ గ్రహం మీద ప్రతి ఒక్కరికీ వారి ప్రతిభ ప్రకారం స్థలం ఉందని, దీనికి గణితం మరియు రసాయన శాస్త్రం అవసరం లేదని తెలియజేశారు. తల్లిదండ్రులు విశాల హృదయంతో ఉండి, పిల్లల విశాల వ్యక్తిత్వాలను పెంపొందించుకోవడానికి అనుమతించాలని, నిరాశగా భావించి వారి జీవితాలను ముగించేలా ఒత్తిడి చేయకూడదని సూచించారు. చివరగా చాలా సిగ్గుగా, విచారంగా ఉందంటూ ఎక్స్‌ వేదికగా తన భావోద్వేగాన్ని వెల్లడిరచారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !