మేనిఫెస్టోపై ఏపీ సీఎం జగన్‌కు గౌరవం లేదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. మేనిఫెస్టో అంటే బైబిల్, ఖురాన్, భగవద్గీత అన్న జగన్ వాటిల్లో ఏ ఒక్కదాని మీదైనా గౌరవం ఉంటే.. మేనిఫెస్టోలో చెప్పినట్టు రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలు చేసి ఉండేవారని ధ్వజమెత్తారు. మద్యపాన నిషేధం చేశాకే ఓటు అడుగుతానన్న జగన్ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని 2024 మేనిఫెస్టో విడుదల చేసి, ఓట్లు అడుగుతారని నిలదీశారు. గత మేనిఫెస్టోపై జగన్ వీడియోను చంద్రబాబు తన ఎక్స్(ట్విటర్) ఖాతాలో విడుదల చేశారు. జగన్ ఏపీ ప్రజలకు ఇచ్చిన 730 హామీలలో నెరవేర్చనివి చాలా ఉన్నాయి. గట్టిగా అరిచి మరీ చెప్పిన ఈ హామీల్లో ఒక్కటి కూడా జగన్ నెరవేర్చలేదు. ఆ మాటకొస్తే 85 శాతం హామీలను జగన్ నెరవేర్చలేదు. ఈ రోజు మళ్ళీ ఇంకో మేనిఫెస్టోతో జనాన్ని మోసం చేయడానికి వచ్చాడు. మళ్ళీ ఇంకోసారి మోసపోడానికి మీరు సిద్ధమా అని అడుగుతాడు. నిన్ను ఇంటికి పంపడానికి సిద్ధం అని మీరు కూడా గట్టిగా చెప్పండి
మేనిఫెస్టో అంటే బైబిల్, ఖురాన్, భగవద్గీత అన్నావు..
— N Chandrababu Naidu (@ncbn) April 27, 2024
వాటిల్లో ఏ ఒక్కదాని మీదన్నా నీకు గౌరవం ఉంటే... 2019 వైసీపీ మేనిఫెస్టోలో చెప్పినట్టు రాష్ట్రంలో మద్యపాన నిషేధం చేసి ఉండేవాడివి.
మద్యపాన నిషేధం చేశాకే ఓటు అడుగుతా అన్న నువ్వు...
ఇప్పుడు ఏ మొఖం పెట్టుకుని 2024 మేనిఫెస్టోని… pic.twitter.com/lqkHGsoBe2