రుణమాఫీపై కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పిన మాట నిజమే అని.. కానీ తాము డిసెంబర్ 9 నాడు మేము రుణమాఫీ చేస్తామని చెప్పలేదు. రుణమాఫీ చేయడానికి ఒక ఏడాది టైం కావాలని తాము ఎక్కడా 100 రోజుల్లో రుణమాఫీ చేస్తామని చెప్పలేదన్నారు. ఇక, కాంగ్రెస్ ఎమ్మెల్యే రుణమాఫీపై చేసిన తాజా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు కాంగ్రెస్ ఎమ్మెల్యేపై మండిపడుతున్నారు. దీంతో తెలంగాణ రైతులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. డిసెంబర్ 9 నాడు మేము రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి... ఎన్నిక కంటే ముందే చెప్పాడని రైతులు అంటున్నారు. కానీ ఇప్పుడు గెలిచాక.. కాంగ్రెస్ నిండా ముంచేసిందని మండిపడుతున్నారు. ఈ వ్యాఖ్యలతో లోక్‌సభ ఎన్నికలపై ప్రభావం పడే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి ఈ అంశంపై వివరణ ఇచ్చుకోవలసిన అవసరం ఏర్పడిరది.
MLA Revuri : డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని చెప్పలేదు ! మాట మార్చిన కాంగ్రెస్ !!
ఏప్రిల్ 12, 2024
0
Tags