KAVITHA : కవితకు కోర్టు షాక్‌ ! కవిత దందాలు బయటపెట్టిన సీబీఐ !

0

ఎమ్మెల్సీ కవితకు మరో భారీ షాక్‌ తగిలింది. కవిత పిటిషన్లను రౌస్‌ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. ఢల్లీి లిక్కర్‌ కేసులో తనను సీబీఐ ప్రశ్నించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌తో పాటు, అరెస్టును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. కాగా, వాదనల సమయంలో కవిత న్యాయవాది విక్రమ్‌ చౌదరి పలు వివరాలు తెలిపారు. తాము పూర్తిగా పోలీసు కేసు గురించి మాట్లాడుతున్నామన్నారు. కవిత అరెస్ట్‌కి రిమాండ్‌ లేదా అరెస్టుకు రిమాండ్‌ రిపోర్టు ఆధారమైతే, అది పూర్తిగా అన్యాయం అని తెలిపారు. కవితను అరెస్ట్‌ చేయడానికి ఎటువంటి కేసు లేదని, సెక్షన్‌ 41ను దుర్వినియోగం చేశారన్నారు. రిమాండ్‌ రిపోర్ట్‌లో ప్రస్తావించిన వాంగ్మూలాలు చాలా పాతవని అన్నారు. వాటిని ఆధారంగా చేసుకుని అరెస్ట్‌ చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. కవితను నిన్న అరెస్ట్‌ చేశామని సీబీఐ కోర్టుకు తెలిపింది. కవితను సీబీఐ 5 రోజుల కస్టడీ కోరింది. మాగుంట రాఘవ సహా నిందితులు సీఆర్పీసీ 161, 164 ప్రకారం ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా కవితను అరెస్ట్‌ చేశామని స్పష్టం చేసింది. లిక్కర్‌ పాలసీ కేసులో కవిత కేజ్రీవాల్‌తో కలిసి కుట్ర చేశారని తెలిపింది. సౌత్‌ గ్రూప్‌కి అనుకూలంగా పాలసీలో మార్పులు చేశారని తెలిపింది. ఈ అరెస్ట్‌పై కవిత పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై కాసేపట్టో కోర్టు తీర్పుని వెల్లడిరచనుంది.

కవిత దందాలను బయటపెట్టిన సిబీఐ !

ఢల్లీి లిక్కర్‌ స్కామ్‌ కేసులో బీఆర్‌ఎస్‌ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత పాత్ర ఏంటో సీబీఐ క్షుణ్ణంగా వెల్లడిరచింది. ఈ కుంభకోణంలో విస్తుగొలిపే మరిన్ని నిజాలను బహిర్గతం చేసింది. కవితే రూ. 100 కోట్లు చెల్లించినట్లు సీబీఐ కస్టడీ రిపోర్ట్‌లో పేర్కొంది. శరత్‌ చంద్రారెడ్డి కవిత జాగృతి సంస్థకు రూ. 80 లక్షల ముడుపులు చెల్లించినట్లు సీబీఐ తెలిపింది. డబ్బుల కోసం శరత్‌ చంద్రారెడ్డిని కవిత బెదిరించారని సీబీఐ వెల్లడిరచింది. ల్యాండ్‌ డీల్‌ చేసుకోకపోతే తెలంగాణలో బిజినెస్‌ ఎలా చేస్తావో చూస్తానని శరత్‌ చంద్రారెడ్డిని కవిత బెదిరించినట్లు కస్టడీ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. అసలు భూమే లేకుండా వ్యవసాయ భూమి కొనుగోలు చేసినట్లు అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్‌ పత్రాలు సృష్టించారంది. నకిలీ భూ విక్రయం పేరుతో శరత్‌ చంద్రారెడ్డి నుంచి రూ. 14 కోట్లు కవిత తీసుకున్నారని సీబీఐ ఆరోపించింది. 

అధికారాన్ని అడ్డంపెట్టుకుని బెదిరింపులు !

ఢల్లీి లిక్కర్‌ బిజినెస్‌కు పరిచయం చేసినందుకు కవితకు చెందిన తెలంగాణ జాగృతి సంస్థకు శరత్‌ చంద్రారెడ్డి రూ. 80లక్షలు చెల్లించారట. మహబూబ్‌ నగర్‌లో వ్యవసాయ భూమి ఉందని, దాన్ని కొనుగోలు చేసినట్లు రూ. 14 కోట్లు ఇవ్వాలని శరత్‌ చంద్రారెడ్డిని కవిత డిమాండ్‌ చేశారట. అసలు ఆ భూమి సంగతి, దాని ధర ఎంతో తెలియనందువల్ల తాను రూ.14కోట్లు ఇవ్వలేని శరత్‌ చంద్రారెడ్డి చెప్పారట. కానీ, రూ. 14 కోట్లు ఇవ్వకపోతే తెలంగాణలో అరబిందో ఫార్మా బిజినెస్‌ ఉండదని కవిత బెదిరించారని సీబీఐ తన కస్టడీ రిపోర్ట్‌లో పేర్కొంది. ఒక్కో రిటైల్‌ జోన్‌కి రూ.5 కోట్లు చెప్పున 5 రిటైల్‌ జోన్‌లకు రూ.25 కోట్లు ఇవ్వాలని శరత్‌ చంద్రారెడ్డిని కవిత డిమాండ్‌ చేశారట. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని కూడా కవిత రూ. 50 కోట్లు డిమాండ్‌ చేశారట. తన కుమారుడు మాగుంట రాఘవ ద్వారా కవితకు ఆయన రూ.25కోట్లు చెల్లించారని సిబిఐ ఆరోపించింది. కేజ్రీవాల్‌ అనుచరుడు విజయనాయర్‌కి కవితే రూ.100కోట్లు చెల్లించారని సీబీఐ తెలిపింది. అలా ఇండో స్పిరిట్స్‌లో 65శాతం వాటా పొందారట. గోవాకు రూ.44.45 కోట్లు హవాలా మార్గంలో బదిలీ చేశారట. ఈ డబ్బును కవిత పిఏ అశోక్‌ కౌశిక్‌ హవాలా డీలర్లకు చేర్చాడట. ఈ విషయాలన్నింటిపైనా కవిత సరైన సమాధానాలు చెప్పడం లేదని.. ఆమెను 5 రోజులు కస్టడీలోకి తీసుకొని మరిన్ని విషయాలను రాబట్టాల్సి ఉందని ప్రత్యేక కోర్టును సీబీఐ కోరింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !