IPL BETTING : ఐపీఎల్‌ బెట్టింగ్‌ కోసం ప్రమోషన్స్‌ ? చర్యలు తీసుకోని ప్రభుత్వాలు !

0

అసలు ఇండియాలో ఏం జరుగుతుంది. ఎవరికీ నచ్చింది వారు పబ్లిక్‌గా చేసేసుకోవచ్చా. చట్టాలు, రాజ్యాంగం పట్టదా. ఈజీ మనీ పేరుతో విద్యార్థుల్ని, మద్య తరగతి వారినీ అందరినీ బెట్టింగ్‌ ఊబీలోకి లాగుతున్నారు. ప్రజలు జీవితాలతో ఆడుకుంటున్నారు. అసలు మన దేశంలో క్రికెట్‌ బెట్టింగ్‌ లీగలైజ్‌  ఎప్పుడు అయ్యింది ? ఇంత బరితెగించి ప్రకటనలు ఇస్తున్నా...పోలీసులు, ప్రభుత్వాలు కనీసం దృష్టి పెట్టకపోవటం శోచనీయం. ఇప్పటికే ఆన్‌లైన్‌ మోసాలతో బలైపోతున్న ప్రజలు ఒకవైపు ఉంటే మరోవైపు డ్రగ్స్‌, బెట్టంగ్‌, ఆన్‌లైన్‌ గేమ్స్‌తో యువతను చిత్తు చేస్తున్నారు. ఇప్పుడు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా, టెలిగ్రామ్‌ ఛానల్స్‌లో అదీ కూడా తెలుగుతో బుల్లితెర తారలతో ఆకట్టుకునేలా బెట్టింగ్స్‌ గురించి డైరెక్ట్‌గా ప్రచారం నిర్వహిస్తున్నాయి టెలిగ్రామ్‌ ఛానల్స్‌. ఈజీగా డబ్బు సంపాదించవచ్చు అని మభ్యపెడుతూ మధ్య తరగతి వారిని అందమైన ప్రకటనలతో ఆకర్షిస్తున్నారు. బెట్టింగ్‌ వైపు ప్రోత్సహిస్తున్నారు. సర్వం కోల్పోయాక కానీ తెలియటం లేదు మోసాపోయామని, ఆ తర్వాత చేసేది లేక ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఐపీఎల్‌ అనేది వినోదం కోసం నిర్వహించేంది, దానిని బెట్టింగ్‌ ఐపీఎల్‌ క్రింద మార్చేశారు. కొన్ని వేల కోట్లు రూపాయాలు చేతులు మారుతోంది. పోలీసులు, ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపకపోతే హైస్కూల్‌ చదివే పిల్లలు బెట్టింగ్‌ వైపు నడిచే ప్రమాదం పొంచి ఉంది. 

బుల్లితెర తారలతో బెట్టింగ్స్‌  ప్రకటనలు

ప్రజెంట్‌ జరుగుతున్న ఐపీఎల్‌ మ్యాచ్స్‌లో మీరు లాస్‌లో ఉన్నారా ? అయితే వెంటనే ఫలానా టెలిగ్రామ్‌ ఛానల్‌లో జాయిన్‌ అవ్వండి. వీళ్ళు 100 % యాక్చురసీ మెంటేన్‌ చేస్తున్నారు. అంతేకాదు ఇప్పటి వరకు జరిగిన అన్నీ ఐపీఎల్‌ మ్యాచ్‌లలో ప్రాఫిట్‌ విన్నింగ్స్‌ ఇస్తున్నారు. టాస్‌ విన్నర్‌, మ్యాచ్‌ విన్నర్‌, సెషన్స్‌ ఇలా అన్ని ఫ్రీగా ఇస్తున్నారు. వెంటనే మా ఛానల్‌లో జాయిన్‌ అవ్వండి, ప్రాఫిట్‌లో ఉండండి...ఇలా ఒకరు... 

ప్రాఫిట్‌లో ఉండండి అని మభ్యపెడుతూ

నేను ప్రిడిక్షన్‌ గానీ, టెలిగ్రామ్‌ లింక్స్‌గానీ అస్సలు నమ్మను. కానీ జస్ట్‌ బికాజ్‌ అఫ్‌ టెలిగ్రామ్‌ ఛానల్‌...ఈ టెలిగ్రామ్‌ ఛానల్‌ ఒక్కడే చాలా ఎక్యురేట్‌ ప్రిడిషన్‌ ఇస్తున్నారు. మ్యాచ్‌కి ముందు నాకు చాలా డౌట్స్‌ ఉండేవి. యాక్చురసీగా ఎలా ఇస్తున్నాడు అని. ఇక్కడ చూడండి గుజరాత్‌ గెలుస్తుందని చెప్పాడు.  గుజరాత్‌ గెలిచింది. నాకు కూడా తెలియదు ఎలాగో, నేను కూడా చాలా మనీ సంపాదించాను. బికాజ్‌ ఓన్లీ ఫలానా టెలిగ్రామ్‌ ఛానల్‌. మీరు కూడా మీ ఫ్రెండ్స్‌కి షేర్‌ చేయండి. ఎందుకంటే మీ ఎనీమీస్‌ విన్‌ అవ్వటం మీకు ఇష్టం ఉండదు కాదు కాబట్టి. ఇదంటే ఒక సెలబ్రిటీ యాడ్‌ చేసి ఫేక్‌బుక్‌ ఇన్‌స్టాలో ప్రమోట్‌ చేస్తున్నారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !