JEE MAIN 2024 : జేఈఈ మెయిన్‌లో నారాయణ హోరు !

0
జేఈఈ మెయిన్‌ 2024 (సెషన్‌-2) ఫలితాల్లో నారాయణ ఆధిపత్యం ప్రదర్శించింది. తెలుగు రాష్ట్రాల్లో మరెవ్వరూ సాధించని అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. ఆలిండియా ఓపెన్‌ కేటగిరీలో 1, 5, 6, 7, 8, 10 వంటి ర్యాంకులతో మరోసారి జేఈఈ మెయిన్‌లో తన పట్టు నిలుపుకుంది. ఇంజినీరింగ్‌ ఎంట్రన్స్‌లకు నారాయణ తప్ప, మరో విద్యాసంస్థ సాటిలేదని, పోటీరారని నిరూపించింది. జాతీయస్థాయిలో ఆలిండియా ఫస్ట్‌ ర్యాంకుతో చరిత్ర సృష్టించటంతో పాటు 10 లోపు 6 ర్యాంకులు, 12 లోపు 7 ర్యాంకులతో నారాయణ తన హవాను కొనసాగించింది. 1, 10 వ ర్యాంకు మహారాష్ట్ర విద్యార్థులు కాగా 5, 6, 7, 8, 10, 12 ర్యాంకులు తెలుగు రాష్ట్రాల నుండి సాధించటం గమనార్హం.  ఆలిండియా ఓపెన్‌ కేటగిరీలో జి. నీల్‌కృష్ణ (హెచ్‌టి.నెం : 240310385062) 1 వ ర్యాంకు,హెచ్‌. విదిత్‌ (హెచ్‌టి.నెం : 240310608827) 5 వ ర్యాంకు, యం.అనూప్‌ (హెచ్‌టి.నెం : 240310552251) 6 వ ర్యాంకు, యం. సాయితేజ (హెచ్‌టి.నెం : 240310661132) 7 వ ర్యాంకు, సి.హెచ్‌. సతీష్‌కుమార్‌ (హెచ్‌టి.నెం : 240310213046) 8 వ ర్యాంకు, ఆర్యన్‌ ప్రకాష్‌ (హెచ్‌టి.నెం : 240310099049) 10 వ ర్యాంకు, పి. రోహన్‌ సాయి (హెచ్‌టి.నెం : 240310106660) 12 వ ర్యాంకు  కైవసం చేసుకున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా ఆలిండియా ఓపెన్‌ కేటగిరీలో 1, 5, 6, 7, 8, 10, 12, 17, 24, 28, 34, 39, 47, 62, 64, 66, 69, 78, 82, 84, 88 వంటి 28 టాప్‌ ర్యాంకులతో పాటు 1000 లోపు 171 ర్యాంకులతో నారాయణ విజయప్రస్థానాన్ని అప్రతిహతంగా కొనసాగించినట్లు తెలిపారు. వీరిలో అత్యధికుల నారాయణ స్కూల్‌ విద్యార్థులే కావటం గమనార్హం. 

అన్ని కేటగిరీల్లో

అలాగే ఆలిండియా అన్ని కేటగిరీల్లో 1, 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 5, 5, 5, 6, 6, 6, 7, 7, 8, 8, 8, 8, 9, 10 వంటి 10 లోపు 25 ర్యాంకులతో పాటు ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 100 లోపు 112 ర్యాంకులు, 1000 లోపు 735 ర్యాంకులు కైవసం చేసుకున్నారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్స్‌ డా॥పి. సింధూరనారాయణ Ê పి.శరణినారాయణ తెలిపారు. జాతీయస్థాయిలో నిర్వహించబడే జెఈఈ`మెయిన్‌ పరీక్ష కొరకు నారాయణ అందిస్తున్న అనితరసాధ్యమైన శిక్షణ, రీసెర్చ్‌ ఓరియంటెడ్‌ ప్రోగ్రామ్‌లు, పటిష్ట ప్రణాళిక, స్టడీమెటీరియల్‌ మరియు నిబద్ధతతో కూడిన వారాంతపు పరీక్షల వల్లనే ఈ ఘనత సాధ్యమైందన్నారు. ఆన్‌లైన్‌ ఎగ్జామ్స్‌ కోసం ప్రత్యేకంగా ఎన్‌`లెర్న్‌ యాప్‌ను రూపొందించటం జరిగిందన్నారు. దీని ద్వారానే ప్రాక్టీస్‌ మరియు అనాలసిస్‌ జరుగుతోందన్నారు. వీటి కోసం ప్రతి క్యాంపస్‌లో ప్రత్యేకంగా కంఫ్యూటర్‌ ల్యాబ్స్‌ను తీర్చిదిద్దినట్లు తెలిపారు. ఇంతటి ఘనవిజయం సాధించిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, అధ్యాపక బృందానికి అభినందనలు తెలియజేశారు. ప్రతిష్టాత్మక ఐఐటిలలో ప్రవేశం కొరకు నిర్వహించే జెఈఈ`అడ్వాన్స్‌డ్‌ కొరకు కేవలం నారాయణ విద్యాసంస్థలకు చెందిన అత్యధిక శాతం విద్యార్థులు జెఈఈ`మెయిన్‌ నుండి క్వాలిఫై కావటం గర్వంగా ఉందని వారు పత్రికా ముఖంగా తెలిపారు. అందుకే ఐఐటికి కేరాఫ్‌ అడ్రస్‌ నారాయణే అని మరోసారి నిరూపించామన్నారు. జేఈఈ మెయిన్‌ రెండు సెషన్‌లు కలిపి 14.15లక్షల మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. మొత్తంగా రెండు సెషన్లకు హాజరైన విద్యార్థులు సాధించిన మెరుగైన స్కోరును పరిగణనలోకి తీసుకొని ఎన్టీఏ మెరిట్‌ లిస్ట్‌ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 2.5 లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేసింది. కేటగిరీల వారీగా కటాఫ్‌ను సైతం ప్రకటించింది. రాష్ట్రాల వారీగా టాపర్స్‌ వివరాలను ప్రకటించింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !