దేశంలోని ప్రఖ్యాత విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్ (JEE MAIN) 2024 సెషన్-2 ఫలితాలు ఏప్రిల్ 25వ తేదీన విడుదలకానున్నట్లు తెలుస్తోంది. అయితే.. జేఈఈ మెయిన్ (JEE MAIN) సెషన్-2 పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ ఆన్సర్ ‘కీ’ తాజాగా విడుదలైన విషయం తెలిసిందే. పరీక్షకు హాజరైన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి ఆన్సర్ కీని చెక్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 4, 5, 6, 8, 9, 12 తేదీల్లో దేశవ్యాప్తంగా 319 సిటీల్లో పరీక్ష నిర్వహించారు. జేఈఈ మెయిన్ తుది విడత పేపర్-1 ప్రిలిమినరీ రాత పరీక్ష ఆన్సర్ ‘కీ’ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. ఈ ప్రాథమిక ఆన్సర్ కీతో పాటు రెస్పాన్స్ షీట్‌లనూ కూడా ఎన్టీయే అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. దేశవ్యాప్తంగా ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో బీటెక్ సీట్లను జేఈఈ మెయిన్ ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేస్తారు. ఐఐటీల్లో చేరాలంటే జేఈఈ అడ్వాన్స్‌డ్ (JEE ADVANCED) రాయాలి. మెయిన్‌లో కనీస మార్కులు సాధించి అర్హత పొందిన 2.50 లక్షల మందికి మాత్రమే అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు అవకాశముంటుంది. జేఈఈ మెయిన్-2023 పరీక్షను మొత్తం 13 భాషల్లో నిర్వహించారు.
కటాప్ పెరిగే అవకాశం !
NTA JEE MAIN 2024 ఫలితాలను ఆన్‌లైన్‌లో jeemain.nta.ac.in లో ప్రకటిస్తుంది. మీ ఫలితాలను తనిఖీ చేయడానికి, మీకు మీ అప్లికేషన్ నంబర్ మరియు DOB అవసరం. సెషన్ 1 మరియు 2 రెండిరటికీ హాజరైన వారు తప్పనిసరిగా రెండు స్కోర్‌లలో ఉత్తమమైన వాటిని JoSSA కౌన్సెలింగ్ కోసం ఉపయోగించబడుతుందని గమనించాలి. ఫలితాలతో పాటు, JEE ADVANCED అడ్వాన్స్‌డ్ 2024కి అర్హత సాధించడానికి JEE మెయిన్‌లో కనీస మార్కులను కూడా NTA విడుదల చేస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, JEE మెయిన్ 2024 కటాఫ్ ఈ సంవత్సరం పెరిగే అవకాశం ఉంది. అంచనా వేయబడిన JEE మెయిన్ కటాఫ్ 2024 జనరల్‌కు 91+, OBCకి 74+, EWSకి 76+, SCకి 55+, STకి 40+ మరియు PHD వర్గాలకు 0.11+. జేఈఈ మెయిన్ స్కోర్ ఆధారంగా దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థలైన ఎన్‌ఐటీ, ఐఐటీలు, సీఎఫ్‌టీఐలలో ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారనే విషయం తెలిసిందే.