Revanth Reddy : రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర...రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

0

బీజేపీ నయవంచన పేరుతో ప్రజా ఛార్జ్‌షీట్‌ని కాంగ్రెస్‌ ఆవిష్కరించింది. పదేళ్ల మోసం- వందేళ్ల విధ్వంసం అంటూ బీజేపీ కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఛార్జ్‌షీట్‌ విడుదల చేసింది. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా.. కృష్ణా జలాల్లో వాటా వంటి అంశాలతో ఛార్జ్‌షీట్‌లో పలు విషయాలను ప్రస్తావించింది. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్‌, సీఎం రేవంత్‌ రెడ్డి బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్లు రద్దు చేయడమే బీజేపీ విధానం.. అందుకే 400 సీట్లు కావాలని అంటోంది.. 2/3 మెజారిటీతో రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర చేస్తోంది.. అంటూ ఆరోపించారు. బీజేపీకి వేసే ప్రతీ ఓటు రిజర్వేషన్ల రద్దుకు వేసినట్టే.. బీజేపీకి ఓటు వేస్తే మీ హక్కును కాలరాసుకున్నట్టే.. అంటూ పేర్కొన్నారు. రిజర్వేషన్లు ఉండాలా, రద్దు కావాలా అనే దానికి.. ఈ ఎన్నికలు రెఫరెండం.. అంటూ సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. వందేళ్లలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు రద్దు చేయాలనేదే ఆర్‌ఎస్‌ఎస్‌ లక్ష్యం. ఆర్‌ఎస్‌ఎస్‌ ఆవిర్భవించి 2025కు వంద సంవత్సరాలు అవుతుంది. అందుకే రిజర్వేషన్లు రద్దు చేసేందుకు మోదీ కుట్ర చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో టూ థర్డ్‌ మెజార్టీ వస్తే.. రాష్ట్రాలపై ఒత్తిడి తెచ్చి రిజర్వేషన్లు రద్దు చేస్తారంటూ రేవంత్‌ రెడ్డి అన్నారు. అలా జరగకుండా ఉండాలంటే బీజేపీకి ఓటు వెయ్యొద్దంటూ సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. 

మోదీ అంటే మోసం !

ఉద్యోగాలు ఇస్తామని మోదీ సర్కార్‌ మోసం చేసిందని.. కొందరి ఒత్తిళ్లకు మోదీ తలొగ్గారంటూ రేవంత్‌ పేర్కొన్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోదీ హామీ ఇచ్చారు.. హామీ ప్రకారం పదేళ్లలో 20కోట్ల ఉద్యోగాలివ్వాలి.. కానీ 7 లక్షల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారన్నారు. అంతేకాకుండా.. ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15లక్షలు వేస్తామన్నారు.. రూ.15 పైసలు కూడా వేయలేదన్నారు. అగ్గిపెట్టె, అగరుబత్తిపై కూడా జీఎస్టీ విధించారు.. నయా భారతాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారంటూ సీఎం రేవంత్‌ రెడ్డి ఫైర్‌ అయ్యారు. పదేళ్లలో మోదీ రూ.113 లక్షల కోట్ల అప్పు చేశారు.. ఎల్‌ఐసీ సహా ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్‌ కంపెనీలకు అమ్మేస్తున్నారన్నారు.. డబుల్‌ ఇంజిన్‌ అంటూ బీజేపీ ఆర్‌ఎస్‌ఎస్‌ విధానాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు.భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రజలను మోసం చేసిందన్నారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇవ్వలేదని.. దేశ ఆస్తులు, సంపదను బడా వ్యాపారులకు అప్పగించాలని మోదీ ప్రభుత్వం చూస్తోందన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !