Tamannah : తమన్నాకి కోర్టు తాఖీదులు ! ఎందుకంటే...

0

వివిధ బ్రాండ్లకు ప్రమోట్‌ చేసే టాప్‌ మోస్ట్‌ హీరోయిన్స్‌ లో ఒకరైన తమన్నా భాటియా ఇప్పుడు సమస్యల్లో చిక్కుకున్నారు. గత కొంతకాలంగా ఆమె మహాదేవ్‌ ఆన్‌లైన్‌ గేమింగ్‌ అండ్‌ బెట్టింగ్‌ అప్లికేషన్‌ కి బ్రాండ్‌ అంబాసిడర్‌ గా పనిచేస్తున్నారు. ఈ యాప్‌ కి ఆమె కొన్ని యాడ్స్‌ కూడా చేసింది. అయితే ఈ ప్రమోషన్‌ కి అభ్యంతరం తెలుపుతూ తమన్నా పై కొంతకాలం క్రితమే కేసు నమోదు చేసారు. ఇప్పుడు ఆమెకి అందులో భాగంగా కోర్టు నోటీసులు పంపింది. సమాజం లో లక్షలాది మంది ప్రేక్షకులను ప్రభావితం చెయ్యగల శక్తి ఉన్నటువంటి తమన్నా వంటి వారు ఇలాంటి బెట్టింగ్‌ యాప్స్‌ ని ప్రోత్సహించడం వాళ్ళ యువత తప్పు మార్గాన్ని ఎంచుకోవడం లో ప్రేపించినవారు అవుతారని తమన్నా పై గతం లో ఎన్నో కామెంట్స్‌ వినిపించాయి. దీనిపై ఇప్పటి వరకు తమన్నా ఎలాంటి రియాక్షన్‌ ఇవ్వలేదు. ఇప్పుడు కోర్టు పంపిన ఈ నోటీసులకు ఆమె ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి. వచ్చే వారం విచారణ కోసం ఆమె సైబర్‌ సెల్‌ కి కచ్చితంగా హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈమధ్య కాలం లో తమన్నా జోరు ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సినిమాల్లో కంటే కూడా ఆమె ఓటీటీ లోని అడల్ట్‌ కంటెంట్స్‌ తో యూత్‌ ని ఉర్రూతలూ ఊగించింది. అలాగే సినిమాల్లో కూడా క్రేజీ ఆఫర్స్‌ ని దక్కించుకుంటూ దూసుకుపోతున్న ఈ సమయం లో ఆమె ఇలాంటి సమస్యల్లో చిక్కుకోవడం గమనార్హం.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !