RRR : MP కాదు MLA స్థానం నుండి రఘురామకృష్ణరాజు

0

వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఎపిసోడ్లో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న సస్పెన్స్‌కి ఎట్టకేలకు తెరపడిరది. శుక్రవారం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన ఆయనకు ఉండి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే టికెట్‌ కేటాయించింది టీడీపీ. అయితే, నరసాపురం నుండి ఎంపీగా పోటీ చేయాలన్న రఘురామ పంతం నెరవేరలేదు. నరసాపురం ఎంపీ స్థానాన్ని టీడీపీకి ఇవ్వవటానికి బీజేపీ ఒప్పుకోకపోవటంతో కాంప్రమైజ్‌ కాక తప్పలేదు. 

ససేమిరా అన్న బీజేపీ అధిష్టానం !

తొలి నుంచి కూటమి తరఫునే పోటీ చేయాలని ఉవ్విళ్లూరిన రఘురామకు నరసాపురం సీటు బీజేపీకి పోవడంతో నిరాశే ఎదురైంది. అయినప్పటికీ ఆ స్థానం కోసం చంద్రబాబుతో భారీ లెవల్‌లో లాబీయింగ్‌ నడిపించారు. బీజేపీతో సీటు మార్పిడి కోసం తెగ ప్రయత్నించారు. ఏలూరు ఎంపీ స్థానం విషయంలో సుముఖత చూపని బీజేపీ అధిష్టానం వైజాగ్‌ సీటు కోరుతుండటంతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఎంపీ సీటు విషయంలో ఎంతకీ తేలకపోవటంతో రాఘరామ మెత్తబడ్డారు. చేసేది లేక చివరికి ఎమ్మేల్యేగా పోటీ చేసేందుకు ఓ మెట్టు దిగారు. తన కోసం పని చేసిన రఘురామకు ఎదో ఒక సీటుతో అడ్చస్ట్‌ కావాలని కోరటంతో ఎమ్మేల్యేగా పోటీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. అలా పార్టీలో చేరిన కొద్ది గంటలకే ఉండి అభ్యర్థిగా రఘురామ పేరును ప్రకటించారు.  టీడీపీ గట్టి పట్టున్న ఉండి నియోజకవర్గం నుండి రఘురామ పోటీ చేయటం అటు టీడీపీకి, ఇటు రఘురామకు కలిసొస్తుందని టీడీపీ శ్రేణులు భావిస్తున్నారు. మరి, ఉండి నుండి పోటీ చేస్తున్న రఘురామ ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతాడా లేదా చూడాలి. అయితే.. రఘురామకు సీటు ప్రకటన చేయగానే.. సిట్టింగ్‌ ఎమ్మెల్యే మంతెన రామరాజు అనుచరులు ఆందోళనకు దిగారు. చంద్రబాబు బయటకు రాకుండా హాలు ముందు బైఠాయించారు. ‘‘ఉండి గడ్డ రామరాజు అడ్డ’’ ‘ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి’ అంటూ నినాదాలు చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !