తెలంగాణ SSC 2024 ఫలితాల్లో నారాయణ విజయదుందుభి మోగించింది. ఎప్పటిలాగే నారాయణ విద్యార్థులు తమ ప్రతిభతో ఆధిపత్యం ప్రదర్శించారు. 10/10 GPA మరియు 9.8 కి పైగా సాధించిన విద్యార్థులు 1707 సాధించగా, 9.5 GPA ఆపైన మార్కులు సాధించిన విద్యార్థులు 43 % మంది ఉండగా, 9.0 GPA ఆపైన మార్కులు సాధించిన విద్యార్థులు 65% పైగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రతి 7 గురు విద్యార్థుల్లో ఒకరికి 10/10 GPAతో 12.5% మంది విద్యార్థులు 10/10 GPA సాధించి రికార్డ్ సృష్టించినట్లు నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్స్ డా॥పి.సింధూర నారాయణ, పి.శరణి నారాయణ తెలిపారు. అన్ని సబ్జెక్టులలో 32135 మంది విద్యార్థులు A గ్రేడ్ పాయింట్స్ సాధించారని తెలిపారు. మొత్తం 41450 మంది విద్యార్థులు టాప్ గ్రేడ్స్ సాధించినట్లు పేర్కొన్నారు. సబ్జెక్టుల వారీగా 10/10 GPA సాధించిన వారు 19224 మంది ఉన్నట్లు చెప్పారు. అదేవిధంగా ఓవరాల్ పాస్ పర్సంటేజ్ 99.3%గా ఉందన్నారు. నారాయణలో చదివిన ప్రతీ విద్యార్థికి సగటుగా 9.1 జీపీఏ సాధించినట్లు చెప్పారు. అదేవిధంగా 100% ఉత్తీర్ణత సాధించిన బ్రాంచీలు 65% ఉన్నట్లు తెలిపారు. అదే సమయంలో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పోటీపరీక్షలకు సంబంధించిన సిలబస్‌ను తమ రోజు వారి సిలబస్‌లో భాగంగా బోధించటం ద్వారా నారాయణ విద్యార్థులు అంతర్జాతీయస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్నారన్నారు. నారాయణ సిఓ`స్పార్క్, ఒలింపియాడ్, ఈ`టెక్నో మరియు మెడిస్పార్క్ ప్రోగ్రామ్స్‌తో బోధన చేయటం కారణంగానే ఘనవిజయాలను కైవసం చేసుకున్నట్లు తెలిపారు.
ప్రోగ్రామ్స్‌తో ఘనవిజయాలు
నేటి పోటీప్రపంచంలో ఎగ్జామ్స్ అన్ని ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నందున నారాయణ సంస్థ కూడా తన విద్యార్థుల కోసం స్కూల్ స్థాయి నుండే ఆన్‌లైన్ ఎగ్జామ్స్‌పై శిక్షణ అందించేందు ఎన్ ` లెర్న్ ప్లాట్‌ఫామ్‌ను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఈ ప్లాట్ ఫామ్‌లో ముఖ్యంగా అంశాల వారీగా, అధ్యాయాల వారీగా పాఠ్యాంశాలపై పట్టు కోసం పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రతి అంశంపై అవగాహన కోసం ప్రత్యేకంగా రూపొందించిన యానిమేటెడ్ వీడియో మాడ్యూల్స్ ఉంటాయన్నారు. సంక్లిష్టమైన అధ్యాయాల్లో అవగాహన కోసం లోతైన విశ్లేషణతో కూడిన మాడ్యూల్స్‌ను అందించనున్నట్లు వివరించారు. అలాగే పరీక్షా సమయంలో ఆందోళనకు గురైయ్యే విద్యార్థుల కోసం ‘దిశ’ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టిననట్లు తెలిపారు. ఏదేని కారణం చేత విద్యార్థులు ఒత్తిడికి గురి అయ్యి ప్రవర్తనలో విపరీతమైన మార్పులు వచ్చినట్లయితే వారి కోసం ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించి, వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించటమే దిశ ప్రోగ్రామ్ లక్ష్యమని తెలిపారు. ఈ సందర్భంగా విజయం సాధించిన విద్యార్థులను నారాయణ విద్యాసంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.పునీత్ ప్రత్యేకంగా అభినందించారు.