Thota Trimurthulu : శిరోముండనం కేసులో 18 నెలల జైలుశిక్ష !

0

ఆంధ్రప్రదేశ్‌లో 1996లో సంచలనం రేపిన శిరోముండనం కేసులో తీర్పు వెలువడిరది. దాదాపు 28 సుదీర్ఘ విచారణ అనంతరం విశాఖ ఎస్సీ, ఎస్టీ కోర్టు నిందితులకు దోషులగా పరిగణించింది. శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులకు (Thota Trimurthulu)18 నెలల జైలుశిక్ష, లక్షన్నర రూపాయల జరిమానా విధించింది. దళితులకు శిరోముండనం కేసులో 28 ఏళ్లకుపైగా విచారణ సాగిన తర్వాత విశాఖ కోర్టు నేరం చేసినట్లుగా నిర్ధారించి తీర్పు ఇచ్చింది.ఈ కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ, మండపేట ఎమ్మేల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులుతో  (Thota Trimurthulu) పాటు 6 మంది నిందితులుగా ఉన్నారు. 1994లో రామచంద్రాపురం నుంచి ఇండిపెండెంట్‌గా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత స్థానిక దళితులపై దాడులకు పాల్పడ్డారు. రాజకీయంగా తమకు ఎదురొస్తున్నారనే అక్కసుతో ఐదుగురు దళితుల్ని హింసించి కనుబొమ్మలు తొలగించి, శిరోముండనానికి పాల్పడ్డారు. ఘటన జరిగిన సమయంలో టీడీపీ (TDP) అధికారంలో ఉంది.

అసలు అప్పుడు ఏం జరిగింది 

1996 డిసెంబర్‌ 29న ప్రస్తుత కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో ఈ ఘటన జరిగింది. ఐదుగురు దళితులను హింసించి ఇద్దరికి శిరోముండనం చేశారు. ఘటన జరిగిన 28ఏళ్ల తర్వాత వెంకటాయపాలెం శిరోముండనం కేసులో విశాఖ కోర్టు తీర్పును వెలువరించింది. శిరోముండనం కేసులో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు నిందితుడిగా ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పాత్రను ప్రాసిక్యూషన్‌ నిరూపించింది. నిందితుల్లో ఒకరు మరణించగా 9మందికి శిక్షలు ఖరారు చేశారు.1997 జనవరి 1న కేసు నమోదైంది. 1994లో తోట త్రిమూర్తులు రామచంద్రాపురం నుంచి ఇండిపెండెంట్‌గా గెలిచి టీడీపీలో చేరారు. స్థానికంగా తనకు వ్యతిరేకంగా ఉన్నారనే కారణంతో దాడి చేసి హింసించారని బాధితులు ఆరోపించారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. బాధితులకు న్యాయం చేయాలంటూ దళిత సంఘాలు పెద్దఎత్తున ఉద్యమించాయి. ఈఘటనలో మొత్తం 24 మంది సాక్షులుగా గుర్తించారు..వారిలో 11 మంది మృతి చెందారు..ఈ కేసు విచారణలో రకరకాల మలుపులు తిరిగింది.1998లో ఈ కేసును కొట్టి వేస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేసింది.. అయితే మళ్లీ హైకోర్టు ఆదేశాలతో 2000లో కేసు రీ ఓపెన్‌ చేశారు..2012 నుంచి 2019 వరకు 148 సార్లు ఈ కేసు వాయిదా పడిరది..28 ఏళ్లుగా సాగిన విచారణ తర్వాత ఇవాళ ఈ కేసులో తోట త్రిమూర్తులకు 18 నెలల జైలుశిక్ష, లక్షన్నర జరిమానా విధించింది.. ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో శిరోముండనం కేసు తీర్పు హాట్‌ టాపిక్‌గా మారింది.. అయితే 28 ఏళ్ల తర్వాత తీర్పు రావడంతో తమకు న్యాయం జరిగిందంటూ బాధితుల కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. న్యాయస్థానం తీర్పుపై దళిత, ప్రజాసంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఈ తీర్పుతో కోర్టుల పట్ల నమ్మకం పెరిగిందని తెలిపాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !